Dunki: డంకీ సీక్రెట్ లీక్ చేసిన షారూక్.. ఓ మహీ అంటూ మరో సర్‌ప్రైజ్

దాదాపు నాలుగు దశాబ్దాలుగా విలక్షణమైన నటన, విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకులను అలరించడంతో పాటు స్టార్‌గా హవాను చూపిస్తూ దూసుకుపోతోన్నారు బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్. ఆ మధ్య చాలా కాలం పాటు ఫ్లాపులతో సతమతం అయిన అతడు.. ఈ ఏడాది వరుసగా 'పఠాన్', 'జవాన్' చిత్రాలతో వరుస హిట్లను ఖాతాలో వేసుకుని ఫుల్ జోష్‌లో కనిపిస్తున్నాడు.

వరుసగా బ్లాక్ బస్టర్లను సొంతం చేసుకుని ఫుల్ ఫామ్‌లో ఉన్న షారూక్ ఖాన్.. ఇప్పుడు 'డంకీ' అనే విభిన్నమైన సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరాణీ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాపై ప్రకటన సమయం నుంచే అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు.

Shah Rukh Khan Reveals Dunki Title Meaning and Announced About Drop 5

సెన్సేషనల్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'డంకీ' మూవీకి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయింది. అలాగే, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను కూడా చాలా వరకూ కంప్లీట్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్‌పై చిత్ర యూనిట్ ఫోకస్ చేసింది. ఇందులో భాగంగానే తాజాగా ఈ చిత్రం గురించి షారూక్ ఖాన్ చేసిన ట్వీట్ హాట్ టాపిక్‌గా మారిపోయింది.

రాజ్‌కుమార్ హిరాణీ - షారూఖ్ ఖాన్ కాంబినేషన్‌లో రాబోతున్న 'డంకీ' మూవీ టైటిల్‌ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై హీరో స్పందించాడు. ఈ మేరకు ట్విట్టర్‌లో 'డంకీ అంటే ఏమిటి అని అంతా అడుగుతున్నారు. డంకీ అంటే మీకు ఇష్టం అయిన వారి నుండి దూరంగా ఉండటం. వారితో మీకు ఉన్న బంధం కారణంగా చివరి క్షణం వరకు కలిసి ఉండాలని భావిస్తారు. ఓ మహి ఓ మహి....ఈరోజు సూర్యుడు అస్తమించే ముందు ప్రేమను అనుభవించు' అని కవితాత్మకంగా వెల్లడించాడు.

'డంకీ' సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ ఇప్పటికే నాలుగు ప్రచార చిత్రాలను విడుదల చేసింది. ఈ క్రమంలోనే 'డ్రాప్ 5' పేరిట ఓ మహీ అంటూ సాగే ఓ ప్రమోషనల్ వీడియోను విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని షారూక్ తాజా ట్వీట్‌లో ప్రకటించాడు.

Shah Rukh Khan Reveals Dunki Title Meaning and Announced About Drop 5

ఇదిలా ఉండగా.. 'డంకీ' మూవీని రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్, రాజ్‌కుమార్ హిరాణీ ఫిల్మ్స్, జియో స్టూడియో బ్యానర్లపై గౌరీ ఖాన్, రాజ్‌కుమార్ హిరాణీ, జ్యోతి దేశ్‌పాండేలు నిర్మిస్తున్నారు. ఇందులో తాప్సీ పన్ను, విక్కీ కౌశల్ వంటి ప్రముఖులు కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రానికి ప్రీతమ్, అమాన్ సంగీతాన్ని ఇస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X