మా అత్త ఆ మాట అడిగింది.. ఇప్పుడు దాని విలువ 200 కోట్లు.. షారుఖ్ ఖాన్!
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. షారుఖ్ స్టైల్ అంటే పిచ్చెక్కిపోయే అభిమానులు ఉన్నారు. షారుఖ్ కు మహిళల్లో ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఇటీవల షారుఖ్ నటించిన జీరో చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. ఇటీవల షారుఖ్ నటించిన చిత్రాలన్నీ వరుసగా నిరాశపరుస్తున్నాయి. అయినా కేవలం రెండు మూడు చిత్రాలతో షారుఖ్ క్రేజ్ కు వచ్చిన నష్టం ఏమీలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో షారుఖ్ ఆసక్తికర విషయం వెల్లడించాడు.

పెళ్ళైన కొత్తలో
పెళ్లయ్యాక తాను, తన సతీమణి గౌరి ఇద్దరం ముంబైకి వచ్చాం. ఆ సమయంలో అపార్ట్ మెంట్ లో ఉండేవాళ్ళాం. ఢిల్లీలో ఉన్నవారికి ఓ అలవాటు ఉంది. అక్కడ తక్కువ ఆదాయం ఉన్న వాళ్ళు కూడా బంగ్లాలో నివసిస్తుంటారు. మా అత్త తరుచుగా మీరు ఇంత ఇరుకు ఇంట్లోఉంటున్నారా అని అడిగేది. కొన్నేళ్ల తరువాత తాను ముంబై బాంద్రా లోని మన్నత్ అనే ఇంటిని కొన్నాను.

ఎన్నో ప్రత్యేకతలు
మన్నత్ విశాలంగా ఉండే భవనం. సముద్రానికి ఎదురుగా ఉంటుంది. షారుఖ్ ఖాన్ ప్రతి పుట్టినరోజుకు అభిమానులు వేలాదిగా మన్నత్ వద్దకు చేరుకుంటారు. షారుఖ్ బాల్కనీలోకి చేరుకొని అభిమానులకు అభివాదం చేస్తాడు. ఇండియాలోని అంత్యత విలాసవంతమైన భవనాలలో షారుఖ్ ఇల్లు కూడా ఒకటి. తాజా ఓ ఇంటర్వ్యూలో షారుఖ్ మాట్లాడుతూ తాను కొన్న వాటిలో అత్యంత ఖరీదైనది ఇల్లే అని షారుఖ్ తెలిపాడు.

ధర ఎంతో తెలుసా
కాగా ప్రస్తుతం మన్నత్ ధర బాగా పెరిగింది. ప్రస్తుతం దాని విలువ 200 కోట్లు పైనే అట. మన్నత్ ని చూసిన ప్రతి సారి తనకు ఢిల్లీలోని బంగ్లాలు గుర్తుకు వస్తాయని షారుఖ్ తెలిపాడు. షారుఖ్ అత్యధిక పారితోషకం అందుకుంటున్న భారతీయ నటులలో 13వ స్థానంలో ఉన్నాడు. ఈ మేరకు షారుఖ్ ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఫోర్బ్స్ లెక్కల ప్రకారం షారుఖ్ గత ఏడాది 56 కోట్ల సంపాదన ఆర్జించాడు.

వరుసగా పరాజయాలు
ఇదిలా ఉండగా షారుఖ్ ఖాన్ గత కొన్నేళ్లుగా వరుసగా పరాజయాలు ఎదుర్కొంటున్నాడు. షారుఖ్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సరిగా రాణించడం లేదు. తాజాగా విడుదలైన జీరో చిత్రం కుడా అభిమానులని నిరాశపరిచింది. దీనితో షారుఖ్ తన కథల ఎంపిక విషయంలో జాగ్రత్త తీసుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











