సినిమానా లేక హోటలా.. మీ చెత్త రివ్యూల వల్ల నేను స్టార్ కాలేదు!

కింగ్ ఖాన్ షారుఖ్ ఎప్పుడూ కూల్ గా కనిపిస్తాడు. ఎలాంటి సందర్భంలోనూ షారుఖ్ సహనం కోల్పోడని బాలీవుడ్ ప్రముఖులు చెబుతుంటారు. తాజాగా షారుఖ్ ఖాన్ ఓ కార్యక్రమంలో షారుఖ్ ఖాన్ సినీ క్రిటిక్స్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. జీరో చిత్రానికి గాను తనపై వచ్చిన కథనాలపై షారుఖ్ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ముంబైలో జరిగిన క్రిటిక్స్ ఫిలిం ఛాయిస్ అవార్డు కార్యక్రమంలో పాల్గొన్న షారుఖ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

డిజాస్టర్ సినిమా ఎఫెక్ట్

డిజాస్టర్ సినిమా ఎఫెక్ట్

ఇటీవల షారుఖ్ ఖాన్ కు సరైన విజయం లేదు. ఖాన్ త్రయంలో మిగిలిన హీరోలు సల్మాన్, అమీర్ తో పోల్చుకుంటే షారుఖ్ విజయలపరంగా బాగా వెనకబడిపోయాడనే టాక్ వినిపిస్తోంది. జీరో చిత్రంలో షారుఖ్ పై ఇలాంటి విమర్శలే వినిపించాయి. షారుఖ్ ఖాన్ వరుసగా ఇలాంటి తప్పుడు నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారు అంటూ షారుఖ్ పై విమర్శలు వెల్లువెత్తాయి. ఫిలిం క్రిటిక్స్ తనపై చేస్తున్న విమర్శలకు షారుఖ్ క్రిటిక్స్ ఫిలిం ఛాయిస్ అవార్డ్స్ కార్యక్రమంలో సమాధానం ఇచ్చాడు.

కథలో నిజాయతీ

కథలో నిజాయతీ

షారుఖ్ ఖాన్ మాట్లాడుతూ.. జీరో చిత్రానికి దాదాపుగా అందురూ 2 మించి రేటింగ్ ఇవ్వలేదు. సినిమాలో మేమంతా విభిన్న ఆలోచనలతో రావాలని అనుకుంటాం. మా ప్రతిభ వీలైనంత ఎక్కువ బయటకు వచ్చేలా ఆరాటపడతాం. ప్రేక్షకులకు తాము చెప్పాలనుకున్న కథలో నిజాయతీ ఉండేలా చూసుకుంటాం అని షారుఖ్ ఖాన్ తెలిపారు. కానీ మీరు మాత్రం షారుఖ్ సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద పతనం.. తప్పులు చేస్తూనే ఉన్న షారుఖ్ అంటూ వార్తలు రాశారని మండిపడ్డారు.

ఇదేమైనా హోటలా

ఇదేమైనా హోటలా

సినీ విశ్లేషకులకు నేను ఒక్కటే చెబుతున్నా.. మీరిచ్చే రేటింగ్ వల్ల నేను స్టార్ కాలేదు. రేటింగ్ తక్కువిచ్చినంత మాత్రాన నా స్టార్‌డం పడిపోదు. మా చిత్రాల జయాపజయాలు మీ పైన ఆధారపడి ఉండవు. మీరంతా ఈ స్టార్ రేటింగ్ సిస్టంలో పడిపోకండి. 3 స్టార్లు, 4 స్టార్లు అంటూ రేటింగ్ ఇచ్చుకుంటూ పోవడానికి ఇదేమైనా హోటలా లేక సినిమానా అంటూ షారుఖ్ ఖాన్ ప్రశ్నించారు. మీరిచ్చే రేటింగ్ వల్ల నా స్టార్‌డం పడిపోయిందనే వ్యాఖ్యలు దయచేసి చేయవద్దు అంటూ షారుఖ్ సూచించారు.

క్రేజీ చిత్రం నుంచి

క్రేజీ చిత్రం నుంచి

జీరో డిజాస్టర్ తర్వాత షారుఖ్ బాగా అప్సెట్ అయ్యాడంటూ వార్తలు వచ్చాయి. జీరో చిత్రం వల్లే షారుఖ్ రాకేష్ శర్మ బయోపిక్ చిత్రం నుంచి కూడా తప్పుకున్నట్లు ప్రచారం జరిగింది. తన తదుపరి చిత్రం గురించి షారుఖ్ ఖాన్ మాట్లాడుతూ.. జూన్ లో తన నిర్ణయం ప్రకటిస్తానని తెలిపాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X