ఆమె కోసం ఎవరూ వెళ్ళరు.. ఆ చిత్రం చూసేది అందుకే.. నెటిజన్‌కు తాప్సి అదిరిపోయే కౌంటర్!
తాప్సి పలు సౌత్ ఇండియన్ చిత్రాల్లో నటించింది. కానీ ఆమెకు ఆశించిన స్థాయిలో విజయాలు దక్కలేదు. బాలీవుడ్ లోకి అడుగుపెట్టి విభిన్న చిత్రాలని ఎంచుకోవడం ప్రారంభించింది. దీనితో తాప్సి నటిగా మంచి గుర్తింపు దక్కింది. విజయాలు కూడా దక్కాయి. అవసరమైన చిత్రాల్లో గ్లామర్ ఆరబోయడానికి కూడా తాప్సి వెనుకాడలేదు. ఇదిలా ఉండగా తాప్సి, బిగ్ బి అమితాబ్ నటించిన బద్లా చిత్రం ఇటీవల విడుదలై మంచి విజయం సాధించింది. ఈ చిత్రం గురించి ప్రస్తావిస్తూ ఓ నెటిజన్ తాప్సిపై కామెంట్ చేశాడు. అతడికి అంతే సింపుల్ గా అదిరిపోయేలా తాప్సి కౌంటర్ ఇచ్చింది.

ఆమె కోసం ఎవరూ వెళ్ళరు
బద్లా చిత్రం మార్చి 8న విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఓ నెటిజన్ ఈ చిత్ర సక్సెస్ గూరిచ్న్హి మాట్లాడుతూ సోషల్ మీడియాలో తాప్సిపై కామెంట్స్ చేశాడు. బద్లా చిత్రంలో ఇంత విజయవంతగా ఆడుతుందంటే అందుకు కారణం షారుఖ్ ఖాన్ అభిమానులు. తాప్సిని చూడడానికి ఎవరూ వెళ్ళరు అంటూ కామెంట్ చేశాడు. ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్ నటించలేదు. ఆయనకు ఎలాంటి ప్రమేయం లేదు. కానీ కేవలం నిర్మాత కాబట్టి షారుఖ్ పై అభిమానంతో సినిమాకు వెళుతున్నాం అని ట్వీట్ చేశాడు.

కనీసం అదైనా ఉంది కదా
తాప్సి సదరు నెటిజన్ కు కూల్ గా కౌంటర్ ఇచ్చింది. ఈ చిత్రంలో షారుఖ్ కు ఎలాంటి ప్రమేయం లేదు. ఆయనకే కేవలం నిర్మాతే అనే వ్యాఖ్యలపై తాప్సి స్పందిస్తూ.. కనీసం ఆయన డబ్బు ప్రమేయం అయినా ఉంది కదా అంటూ సమాధానం ఇచ్చింది. కెరీర్ ఆరంభం నుంచే ఎలాంటి విషయం గురించి అయినా తాప్సి ముక్కు సూటిగా మాట్లాడడం నేర్చుకుంది.

చిన్నపాటి సంచలనమే
బద్లా చిత్రం విడుదలై విజయం సాధించిన తర్వాత ఓ పత్రికలో అమితాబ్ బచ్చన్ ని ప్రశంసిస్తూ కథనం వెలువడింది. అమితాబ్ ఈ చిత్రంలో అద్భుత నటన కనబరిచారని ఆ కథనంలో రాశారు. దీనిపై తాప్సి స్పందిస్తూ మహిళలు కూడా ఈ చిత్రం కోసం సమానంగా కష్టపడ్డారు. బహుశా ఆ విషయం పేర్కొనడానికి మీకు సమయం లేదేమో అంటూ తాప్సి సదరు పత్రికపై మండిపడింది. ఈ వ్యవహారం బాలీవుడ్ లో చిన్నపాటి సంచలనంగానే మారింది.

కృతి సనన్
ఈ విషయంలో మరో హాట్ బ్యూటీ కృతి సనన్ తాప్సి వ్యాఖ్యలని సమర్ధించింది. కార్తీక్ ఆర్యన్, కృతి జంటగా నటించిన లూకా చుప్పీ మంచి విజయం సాధించింది. కానీ ఆ చిత్ర క్రెడిట్ మొత్తం హీరోకే కట్టబెట్టారు అని కృతి సనన్ పేర్కొంది. తనది కూడా ఆ చిత్రంలో చాలా కీలక పాత్ర అయినప్పటికీ అంతా కార్తీక్ ఆర్యన్ జపమే చచేశారు అని కృతి పేర్కొంది.


Click it and Unblock the Notifications











