షారుక్ ఖాన్‌కు తీవ్ర విషాదం.. ప్రాణ స్నేహితుడి మరణంతో బాధలో బాద్షా
కరోనా లాక్‌డౌన్ సమయంలో సినీ ప్రముఖులను విషాదాలు వెంటాడుతున్నాయి. కొద్ది రోజుల క్రితం అమీర్ ఖాన్‌కు అత్యంత సన్నిహితుడైన సహాయకుడు గుండెపోటుతో మరణించగా.. తాజాగా షారుఖ్ ఖాన్ వ్యాపార భాగస్వామి అభిజిత్ ఆకస్మిక మరణం పొందారు. దాంతో బాలీవుడ్ బాద్షా షారుక్ విషాదంలో కూరుకుపోయారు. అభిజిత్ ఇకలేరంటూ భావోద్వేగానికి గురైన షారుక్ తన బాధను సోషల్ మీడియా ద్వారా పంచుకొన్నారు. అభిజిత్ గురించి ట్విట్టర్‌లో షారుక్ ట్వీట్ చేస్తూ..

అభిజిత్‌తో అనుబంధం
అభిజిత్‌తో నాకు చాలాకాలంగా అనుబంధం ఉంది. డ్రీమ్జ్ అన్‌లిమిటెడ్ బ్యానర్‌పై సినిమాల నిర్మాణాలు చేపట్టడం ప్రారంభించాం. అభిజిత్ మాకు అత్యంత నమ్మకమైన వ్యక్తిగా ఉంటూ, వెన్నెముక లాంటి సపోర్ట్ ఇచ్చారు. మా ప్రయాణంలో చాలా మంచి విషయాలు ఉన్నాయి. కొన్ని తప్పుడు నిర్ణయాలు ఉన్నప్పటికీ.. మా జర్నీ చాలా స్ట్రాంగ్‌గా సాగింది అని షారుక్ ఖాన్ అన్నారు.

రెడ్ చిల్లీస్‌లో కీలకంగా
ఆ తర్వాత మా రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో కీలక భాగస్వామిగా మారారు. మా బిజినెస్ ప్రయాణాన్ని తన భుజాలపైకి ఎత్తుకొని ముందుకు నడిపించారు. ఆయన ఓ బాధ్యతాయుతమైన భాగస్వామి. ఆయన ఈ లోకాన్ని వీడి మమల్ని విషాదంలో ముంచారు. ఆయన లేని లోటు మాకు ఎవరూ పూడ్చలేరు అంటూ షారుక్ ఖాన్ ఎమోషనల్ అయ్యారు.

అభిజిత్ అత్యంత నమ్మకమైన భాగస్వామి
అభిజిత్ లాంటి వాళ్లు భాగస్వామిగా ఉంటే ఎవరైనా నిశ్చింతగా ఉండొచ్చు. ఆయనపై నమ్మకం పెట్టుకొని ప్రశాంతంగా మన పనులు మనం చేసుకోవచ్చు. అలాంటి అభిజిత్‌ను, అంతకంటే నాకు గొప్ప స్నేహితుడిని కోల్పోవడం చాలా బాధగా ఉంది. అభిజిత్ ఆత్మకు శాంతి కలుగాలి. ఆయన కుటుబానికి దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలంటూ షారుక్ ఖాన్ ట్విట్టర్‌లో సంతాపం వ్యక్తం చేశారు.

లాక్‌డౌన్‌లో షారుక్ జీవిత సత్యాలు
ఇక ప్రస్తుతం లాక్‌డౌన్‌లో ఉన్న షారుక్ ఖాన్ ముంబైలో ఫ్యామిలీతో కాలం గడుపుతున్నారు. శుక్రవారం షారుక్ కొన్ని లాక్‌డౌన్ పాఠాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకొన్నారు. ఏది ఏమైనా ప్రేమ అనేది అత్యంత విలువైనది. ఎవరెన్ని చెప్పినా దానికి సాటి రాదు అంటూ షారుక్ అన్నారు. ఒకసారి కాలమనే గడియారం ఆగిపోతే పరిస్థితి ఎంత దుర్బరంగా ఉంటుందో అనే విషయం ప్రస్తుతం మనం అనుభవిస్తున్న రోజులు మనకు పాఠాలు నేర్పుతున్నాయి అని షారుక్ ఖాన్ అన్నారు.


Click it and Unblock the Notifications











