బ్రేకింగ్: Aryan Khan ఎట్టకేలకకు జైలు నుంచి విడుదల.. షారుక్ దంపతులను వెనక్కి పంపిన అధికారులు.. ఏం జరిగిందంటే?
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ఎట్టకేలకు ఆర్థర్ రోడ్ జైలు నుంచి విడుదల అయ్యాడు. సుమారు 27 రోజుల క్రితం ముంబై, గోవా క్రూయిజ్‌లో జరిగిన పార్టీలో డ్రగ్స్ ఉపయోగిస్తున్నారనే ఆరోపణలపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే పలుమార్లు బెయిల్ పిటిషన్‌ను స్థానిక ముంబై కోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. అయితే బాంబే హైకోర్టు అక్టోబర్ 28న ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ మంజూరు చేయడంతో ఆర్యన్ ఖాన్ బయటకు వచ్చారు. ఈ కేసు వివరాల్లోకి వెళితే..

మూడు వారాలుగా ఆర్యన్ ఖాన్ జైలులోనే
డ్రగ్స్ కేసులో అక్టోబర్ 3వ తేదీన ఆర్యన్ ఖాన్‌ను, ఆయన స్నేహితుడు అర్బాజ్ మర్చంట్, ఫ్యాషన్ డిజైనర్, మోడల్ మున్‌మున్ దమేచాను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆర్యన్, అర్బాజ్‌ను ఆర్థర్ రోడ్ జైలుకు తరలించగా, దమేజాను బైకుల్లా మహిళా జైలుకు తరలించారు. అప్పటి నుంచి వారి బెయిల్ పిటిషన్ నాలుగు సార్లు తిరస్కారానికి గురైంది.

బెయిల్ లభించినా విడుదలలో జాప్యం
రెండు రోజుల క్రితంబెయిల్ లభించినా.. ఫార్మాలిటీలు పూర్తి కాకపోవడంతో ఆర్థర్ రోడ్ జైలు నుంచి ఆర్యన్ ఖాన్ విడుదల ఆలస్యమైంది. అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొన్న తర్వాత శనివారం ఉదయం ఆర్యన్ ఖాన్‌ను జైలు నుంచి విడుదల చేశారు. ఆర్యన్‌ను తీసుకెళ్లడానికి షారుక్ ఖాన్ వ్యక్తిగత సిబ్బంది జైలు వద్దకు చేరుకొన్నారు.

శనివారం ఉదయమే జైలు వద్దకు షారుక్
తన కుమారుడు ఆర్యన్‌ను ఇంటికి తీసుకెళ్లేందుకు తన నివాసం మన్నత్ నుంచి షారుక్ ఖాన్ దంపతులు జైలు వద్దకు చేరుకొన్నారు. కానీ అభిమానులు భారీ సంఖ్యలో పోటెత్తడంతో జైలు అధికారులు వారిని వెనుకకు పంపించారు. దాంతో తన వ్యక్తిగత బాడీగార్డ్ రవిని అక్కడే వదిలేసి సమీపంలో ఉన్న హోటల్‌కు షారుక్ దంపతులు వెళ్లారు. ఆర్యన్ ఖాన్ విడుదలైన తర్వాత ఆ హోటల్ నుంచి ఇంటికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు.

ఆర్యన్‌కు కోర్టుకు విధించిన షరతులు
ఇదిలా ఉండగా, ఆర్యన్ ఖాన్‌కు బాంబే హైకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. జైలు నుంచి విడుదల కావడానికి ముందే.. ఎన్సీబీ స్పెషల్ కోర్టులో ఆర్యన్ ఖాన్ తన పాస్‌పోర్టును అప్పగించాలి, ప్రతీ శుక్రవారం ఎన్సీబీ ఆఫీస్‌లో 11 గంటల నుంచి 2 గంటల మధ్య హాజరుకావాలి. తన సహ నిందితులతో ప్రత్యేక్షంగా గానీ, పరోక్షంగా గానీ కమ్యూనికేషన్ కొనసాగించరాదు. ఆర్యన్ ఖాన్ వ్యక్తిగతంగానీ మరో వ్యక్తితో గానీ.. సాక్ష్యులను ప్రభావితం చేయడం, లేదా సాక్ష్యాలను రూపుమాపకుండా ఉండాలి. స్పెషల్ కోర్టులో కేసు విచారణలో ఉన్నందున మీడియాలో ఎలాంటి ప్రకటనలు ఆర్యన్ ఖాన్ చేయకూడదు అని హైకోర్టు స్పష్టం చేసింది.

ఘనంగా దీపావళీ, షారుక్ బర్త్ డే సెలబ్రేషన్స్
సాధారణంగా షారుక్ ఖాన్ జన్మదినంతోపాటు దీపావళీ వేడుకలను కుటుంబం ఘనంగా జరుపుకొంటుంది. షారుక్ ఖాన్ బర్త్ డే నవంబర్ 2వ తేదీన, దీపావళీ 4వ తేదీన ఉన్న సంగతి తెలిసిందే. ఈ రెండు వేడుకల ముందు ఆర్యన్ ఖాన్ రీలీజ్ కావడంతో షారుక్ కుటుంబంలో పండగ వాతావరణం నెలకొన్నది.


Click it and Unblock the Notifications











