Aryan Khan's Drug Case: షారుక్ ఖాన్‌కు మరో షాక్.. అక్టోబర్ 14వ తేదీన కీలక తీర్పు?
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్‌కు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. ముంబై డ్రగ్స్ రాకెట్ కేసులో అరెస్ట్ అయిన తన కుమారుడు ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ ఇవ్వడానికి ఎన్‌డీపీఎస్ కోర్టు నిరాకరించింది. ఆర్యన్ బెయిల్ పిటిషన్‌ను మూడోసారి బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. అయితే బెయిల్ పిటిషన్‌ను గురువారం మరోసారి విచారించడనున్నట్టు న్యాయమూర్తి తెలిపారు. విచారణను అక్టోబర్ 14వ తేదీకి వాయిదా వేశారు. ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ విచారణకు షారుక్ ఖాన్ మేనేజర్ పూజా దల్దానీ, బాడీగార్డ్ రవి హాజరయ్యారు.
అయితే షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్‌కు ఇంటర్నేషన్ డ్రగ్స్ రాకెట్‌తో సంబంధాలు ఉన్నాయని ఎన్సీబీ అధికారులు తమ వాదనలు వినిపించారు. డ్రగ్స్ సేకరణ, పంపిణీలో ఆర్యన్ కీలకంగా వ్యవహరించారు అని పేర్కొన్నారు. షిప్‌లో అధికారులు దాడులు జరిపిన సమయంలో ఆర్యన్ అక్కడ లేడు. ఆయన డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు ఆధారాలు లేవు. ఆయనతో డ్రగ్స్ కూడా లేవు అని ఆర్యన్ ఖాన్ తరఫు న్యాయవాది వాదన వినిపించారు. అయితే వాదనలు విన్న న్యాయమూర్తి బెయిల్ పిటిషన్‌పై విచారణను గురువారానికి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకొన్నారు.

ముంబై నుంచి గోవాకు వెళ్లే ఓడలో ఆర్యన్ ఖాన్, తన స్నేహితులతో పార్టీ చేసుకొండగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు మెరుపులు దాడి చేశారు. అనంతరం ఆర్యన్ ఖాన్‌ను అరెస్ట్ చేశారు. దాంతో బాలీవుడ్ పరిశ్రమ తీవ్ర దిగ్బ్రాంతికి గురిఅయింది. ఇప్పటి వరకు మూడుసార్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు తిరస్కరించింది. తాజాగా సల్మాన్ ఖాన్‌కు పలు కేసుల్లో వాదించిన అమిత్ దేశాయిని షారుక్ ఖాన్ న్యాయవాదిగా నియమించుకొన్నారు


Click it and Unblock the Notifications











