షారుక్ ఖాన్ ‘జీరో’ ఈద్ స్పెషల్ టీజర్... సర్‌ప్రైజ్ చేసిన సల్మాన్
షారుక్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న 'జోరో' మూవీకి సంబంధించిన స్పెషల్ టీజర్ ఈద్ సందర్భంగా విడుదల చేశారు. ఈ టీజర్లో సల్మాన్ ఖాన్ కూడా కనిపించి సర్‌ప్రైజ్ చేశారు. బాలీవుడ్ టాప్ స్టార్స్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం అభిమానుల్లో మరింత ఉత్సాహం నింపింది సినిమాపై అంచనాలు మరింత పెంచింది. గతంలోనూ షారుక్ 'ఓం శాంతి ఓం' సినిమాలో కూడా సల్మాన్ ఖాన్ స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

తాజాగా విడుదలైన టీజర్లో... మరుగుజ్జు షారుక్‌తో సల్మాన్ డాన్స్ చేస్తూ కనిపించాడు. చివర్లో షారుక్ జంప్ చేసి సల్మాన్ చంకెక్కడం, అతడి బుగ్గలపై ముద్దు పెట్టడం అందరినీ ఆశ్చర్య పరిచింది. ఈ టీజర్ షారుక్ స్వయంగా తన సోషల్ మీడియా పేజీ ద్వారా షేర్ చేస్తూ అభిమానులకు ఈద్ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ చిత్రానికి ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించబోతున్నారు. కత్రినా కైఫ్, అనుష్క శర్మ ముఖ్యమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. మరుగుజ్జు పాత్రలో షారుక్ అభిమానులను ఎంటర్టెన్ చేయబోతున్నారు.
షారుక్ సొంత బేనర్ రెడ్ చిల్లీస్ ఎంటర్టెన్మెంట్స్‌పై ఆయన భార్య గౌరీ ఖాన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అజయ్-అతుల్ సంగీతం అందిస్తున్నారు. డిసెంబర్ 21న ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ విడుదలవ్వబోతోంది.


Click it and Unblock the Notifications











