Don't Miss!
- Finance Insurance Company: ఈ శని, ఆదివారాలు తెరిచి ఉండనున్న బీమా కంపెనీలు..
- News జగన్ సీఎం కావాలని చెప్పుల్లేకుండా అభిమాని దీక్ష-స్వయంగా వెళ్లి విరమింపజేసిన వైనం..!
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్‌కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్‌లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- Travel గుడ్‌ప్రైడే రోజున లాంగ్‌వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్‌లు చూసేయండి...
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
స్టార్ కిడ్ అసహనం.. తప్పుకోండంటూ చేతులతో సైగలు
బాలీవుడ్ స్టార్ కిడ్స్‌కు సోషల్ మీడియాలో ఏరేంజ్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తైమూర్ ఖాన్, అబ్రామ్ ఖాన్, ఆరాధ్య బచ్చన్ లాంటి వారు స్టార్ స్టేటస్‌ను అనుభవిస్తున్నారు. ఈ అందరిలో కెల్లా తైమూర్ బుడ్డోడు కావడం, బయటకు వచ్చినప్పుడు చేసే చిలిపి పనులు వల్ల మరింత ఫేమస్ కావడం అందరికీ తెలిసిందే. తాజాగా షారుఖ్ కుమారుడు అబ్రామ్ చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సోషల్ మీడియా వైరల్..
స్టార్ కిడ్స్ కనిపిస్తే.. కెమెరామెన్లు, ఫోటోగ్రాఫర్లు తమ కళ్లకు, చేతులకు పనులు చెబుతారు. సోషల్ మీడియాలో వీరి ఫోటోలు కనిపిస్తే చాలు వేలు, లక్షల్లో లైకులు వచ్చి పడుతుంటాయి. మీడియం రేంజ్ హీరో, హీరోయిన్ల కంటే ఎక్కువ ఫాలోయింగ్ ఈ పిల్లలకే ఉందన్న సంగతి అందర్నీ ఆశ్చర్యపరుస్తుంటుంది.
|
పార్టీకి వెళ్లి వస్తుండగా..
బాలీవుడ్ బడా నిర్మాత ఆదిత్య చోప్రా- నటి రాణీ ముఖర్జీల గారాలపట్టి ఆదిరా పుట్టినరోజు సందర్భంగా.. పార్టీకి వెళ్లి వస్తున్న క్రమంలో అబ్రాం ఇలా అసహానికి లోనయ్యాడు. ఈ పార్టీలో అబ్రాంతో పాటు ఇతర సెలబ్రిటీల పిల్లలు కూడా సందడి చేశారు. అబ్రామ్ అసహానానికి లోనైన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తప్పుకోండంటూ సైగలు..
అలా వారు బయట కనిపిస్తే చాలు.. ఫొటోలో బంధించేందుకు ఉత్సాహం చూపిస్తారు. అయితే వ్యవహారంలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్- గౌరీఖాన్‌ల తనయుడు అబ్రామ్ ఖాన్(6)కు విసుగు తెప్పించింది. కారు వెళ్లకుండా అడ్డుగా ఉంటూ.. తనపై ఫ్లాష్ల వర్షం కురిపిస్తున్న ఫొటోగ్రాఫర్లపై అబ్రాం అసహనం వ్యక్తం చేశాడు. కారుకు అడ్డు తప్పుకోవాలని చేతులతో సైగలు చేస్తూ.. తన ముఖాన్ని దాచుకున్నాడు.
Recommended Video
గతంలోనూ ఇలానే..
ఈ క్రమంలో.. ‘చిన్నారిని తన బాల్యం ఎంజాయ్ చేయనివ్వకుండా ఎందుకు ఇలా చేస్తున్నారు' అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక అబ్రాం ఇలా ప్రవర్తించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ముంబై ఎయిర్‌పోర్టులో ఫొటోగ్రాఫర్లకు చిక్కకుండా తన బొమ్మను అడ్డుపెట్టుకున్నాడు. అదే విధంగా మరో ఈవెంట్లో సైతం తన ఫొటోలు తీయొద్దంటూ కెమెరామెన్లను హెచ్చరించాడు.