Aryan Khan: లిక్కర్ బిజినెస్ లోకి షారుక్ ఖాన్ తనయుడు.. ఆ సంస్థతో కలిసి భారీగా పెట్టుబడి
బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ కూడా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతున్నట్లు గతంలో చాలా రకాల రూమర్స్ వచ్చాయి. అయితే అతను హీరోగా చేయడానికి ఇష్టపడడం లేదు అనే విధంగా కొన్ని కామెంట్స్ కూడా వచ్చాయి. కానీ ఇప్పటివరకు ఆ విషయంలో ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు. అంతేకాకుండా ఆర్యన్ ఖాన్ అయితే ఎక్కువగా డైరెక్షన్ చేయాలి అనే ఆలోచనతోనే ఉన్నట్లుగా షారుక్ ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు. త్వరలోనే అతని దర్శకత్వంలో మొదటి సినిమా రాబోతుంది అని కూడా బాలీవుడ్లో నిత్యం కథనాలు వెలువడుతూనే ఉన్నాయి.
ప్రస్తుతం ఆర్యన్ ఖాన్ వయసు 25 సంవత్సరాలు. అయితే ఇప్పుడు అతను ఒక వ్యాపారం లోకి అడుగుపెడుతున్నట్లుగా తెలుస్తోంది. అది కూడా లిక్కర్ బిజినెస్ లోనే అతను పెట్టుబడులు పెట్టడానికి రెడీ అయినట్లు అధికారికంగా ఒక ప్రకటన అయితే వచ్చింది. భారతదేశంలో D'YAVOL పేరుతో కొత్త వోడ్కా బ్రాండ్ ను స్టార్ట్ చేసిన అతను మీడియాలో మరోసారి హాట్ టాపిక్ గా మారాడు.

ఇక ఆర్యన్ తన కొత్త బ్రాండ్ కోసం ప్రపంచంలోనే అతిపెద్ద బ్రూయింగ్ కంపెనీ అయిన AB InBev తో కూడా భాగస్వామిగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇదివరకే షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ డ్రగ్స్ వివాదాలతో మీడియాలో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అతను వోడ్కా వ్యాపారంతో తన బిజినెస్ కెరీర్ ను స్టార్ట్ చేయడంతో మరోసారి వీడియోలో చర్చనీయాంశంగా మారాడు.
షారుక్ ఖాన్ వారసుడిగా సినిమా ఇండస్ట్రీలో అతను మంచి యాక్టర్ గా కొనసాగుతాడు అని ఫ్యాన్స్ ఇన్ని రోజులు ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. కానీ ఇప్పుడు మాత్రం ఆర్యన్ ఊహించిన విధంగా బిజినెస్ లోకి అడుగు పెట్టాడు. ఇందులో అతని స్నేహితులు కూడా భారీగా పెట్టుబడులు పెడుతున్నట్లు సమాచారం. ఈ వ్యాపారాన్ని దేశ విదేశాల్లో కూడా విస్తరింపజేయాలి అని ఆర్యన్ ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. మరోవైపు షారుక్ ఖాన్ పఠాన్ సినిమా వచ్చే ఏడాది జనవరిలో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











