twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ ప్లాప్ అని తేల్చేసిన షారుఖ్.. అమిర్ సినిమా గురించి నెగిటివ్‌గా!

    |

    ఒక స్టార్ హీరో నటించిన సినిమా గురించి మరో హీరో మాట్లాడడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఒకవేళ మాట్లాడాల్సి వచ్చిన పాజిటివ్ గా స్పందిస్తారు. సినిమా ఎంత నిరాశ పరిచినా మంచి చిత్రం అనే కామెంట్ చేస్తారు. ఇక సినిమా రన్నింగ్ లో ఉంటే చిత్ర యూనిట్ తో పాటు సెలెబ్రిటీలు ఎవరూ నెగిటివ్ కామెంట్స్ చేయరు. కానీ ఇటీవల షారుఖ్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ చిత్రం గురించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

    దారుణంగా కలెక్షన్లు

    దారుణంగా కలెక్షన్లు

    సాధారణంగా అమిర్ ఖాన్ చిత్రాలకు మంచి క్రేజ్ ఉంటుంది. అందుకు తగ్గట్లుగానే తొలిరోజు 50 కోట్లు వసూలుచేసి థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ చిత్రం.. రెండవ రోజు నుంచి చతికిలబడింది. తొలి వీకెండ్ ముగిసే సరికి థియేటర్స్ మొత్తం ఖాళీగా దర్శనం ఇచ్చాయి. కనీసం థియేటర్ రెంట్ కూడా వసూళ్లు రావడం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

    ప్లాప్ అని తేల్చేశాడు

    ప్లాప్ అని తేల్చేశాడు

    థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ చిత్రం గురించి మీడియా షారుఖ్ ని ప్రశ్నించగా ఆశ్చర్యకర సమాధానం ఇచ్చాడు. మరో స్టార్ హీరో సినిమా గురించి మాట్లాడేముందు ఏ హీరో అయినా ఆచితూచి వ్యవహరిస్తాడు. కానీ షారుఖ్ మాత్రం థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ చిత్రం ప్లాప్ అంటూ ఒక్కమాటలో తేల్చేశాడు. పైగా సానుభూతి తెలియజేస్తూ పెద్ద వివరణ ఇచ్చాడు.

    వారి కష్టాన్ని కాదనలేం

    వారి కష్టాన్ని కాదనలేం

    నాకు అమితాబ్ బచ్చన్ గారు, అమిర్ ఖాన్ గారు చాలా ఏళ్లుగా తెలుసు. వాళ్ళు నటించిన చిత్రం నిరాశపరచడం బాధాకరం అని షారుఖ్ తెలిపాడు. అంతమాత్రాన అమిర్ ఖాన్, షారుఖ్ ఖాన్ పడ్డ కష్టాన్ని ఎవరూ కాదనలేరని షారుఖ్ తెలిపాడు. దశాబ్దాల కాలంగా వారిద్దరూ హిందీ సినిమా కోసం ఎంతో చేస్తున్నారని షారుఖ్ తెలిపాడు.

    ప్రేక్షకులు అర్థం చేసుకోవడం కష్టం

    ప్రేక్షకులు అర్థం చేసుకోవడం కష్టం

    శ్రద్దా కపూర్ నటించిన స్త్రీ చిత్రం అద్భుతంగా రాణిస్తుందని ముందే ఊహించా. అందుకు తగ్గట్లుగానే ఆ చిత్రం ఘనవిజయం సాధించింది. థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ విషయంలో కూడా అలాగే అనుకున్నా. కానీ దురదృష్టవశాత్తూ ఆలా జరగలేదని షారుఖ్ అభిప్రాయ పడ్డాడు. ప్రేక్షకులు ఎప్పుడు ఎలాంటి చిత్రాన్ని ఆదరిస్తారో ఊహించడం కష్టం అని అమిర్ తెలిపాడు.

    ఇలాంటి చిత్రాలు రావాలి

    ఇలాంటి చిత్రాలు రావాలి

    స్త్రీ, థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ లాంటి విభిన్న చిత్రాలు రావాల్సిన అవసరం ఉందని షారుఖ్ అభిప్రాయ పడ్డారు. కేవలం థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ గురించి మాత్రమే మాట్లాడుకుంటే.. ఇలాంటి అడ్వెంచర్ జోనర్ లో సినిమా వచ్చి చాలా ఏళ్ళు గడుస్తోంది. నాకు తెలిసి ఆ జోనర్ లో వచ్చిన చివరి చిత్రం పరస్మాని అని షారుఖ్ అభిప్రాయపడ్డాడు. ఈ చిత్రం 1963 లో వచ్చింది.

    English summary
    Shah Rukh Khan defends Aamir Khan’s Thugs of Hindostan, says people have been too harsh Shah Rukh Khan spoke about the failure of Aamir Khan’s Thugs of Hindostan at the box office
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X