Dunki Trailer: సర్‌ప్రైజింగ్‌గా డంకీ ట్రైలర్.. షారూక్ నుంచి ఊహించని విధంగా!
సుదీర్ఘ కాలంగా ఇండియన్ సినిమాపై ప్రభావాన్ని చూపిస్తూ నెంబర్ వన్ హీరోగా దూసుకుపోతోన్నాడు బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్. కెరీర్ తొలినాళ్ల నుంచే విభిన్నమైన సినిమాలు చేస్తూ వచ్చిన ఈ బడా హీరో.. చాలా కాలం పాటు పరాజయాల పరంపరతో ఇబ్బంది పడ్డాడు. అలాంటిది ఈ ఏడాది 'పఠాన్', 'జవాన్' చిత్రాలతో వరుస హిట్లను ఖాతాలో వేసుకున్నాడు.
హిట్లు మీద హిట్లు కొడుతూ ఫుల్ జోష్‌లో ఉన్న షారూక్ ఖాన్.. ఇప్పుడు 'డంకీ' అనే విభిన్నమైన సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరాణీ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాపై ప్రకటన సమయం నుంచే అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించారు.

క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'డంకీ' మూవీకి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయింది. అలాగే, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను కూడా చాలా వరకూ కంప్లీట్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్‌పై చిత్ర యూనిట్ ఫోకస్ చేసింది. ఇందులో భాగంగానే తాజాగా ఈ చిత్రం నుంచి 'డంకీ డ్రాప్ 4' పేరిట ట్రైలర్ వీడియోను విడుదల చేశారు.
రాజ్‌కుమార్ హిరాణీ - షారూఖ్ ఖాన్ కాంబినేషన్‌లో రాబోతున్న 'డంకీ' మూవీ ట్రైలర్ వీడియో కాసేపటి క్రితమే విడుదలైంది. ఇందులో కామెడీకే ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపించింది. ముందుగా హీరో షారూక్ తన పక్కన ఉన్న కొందరిని పరిచయం చేశాడు. ఆ తర్వాత వాళ్ల నేపథ్యాలను చూపించి.. చివర్లో సీరియస్ యాక్షన్ సీక్వెన్స్‌ను చూపించి ఆసక్తిని పెంచేశారు.
ముఖ్యంగా ఇందులో షారూక్ ఖాన్ కనిపించిన తీరు అద్భుతంగా ఉంది. 90 దశకంలో ఎలాంటి లుక్‌లో ఉండేవాడో ఇప్పుడు కూడా అదే రీతిలో మెస్మరైజ్ చేశాడు. మిగిలిన వాళ్లు కూడా తమదైన యాక్టింగ్‌తో మెప్పించాడు. ఇక, ఇందులో డైరెక్టర్ టేకింగ్, విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకునేలా ఉన్నాయి. మొత్తంగా ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింతగా పెంచేసింది.
ఇదిలా ఉండగా.. 'డంకీ' మూవీని రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్, రాజ్‌కుమార్ హిరాణీ ఫిల్మ్స్, జియో స్టూడియో బ్యానర్లపై గౌరీ ఖాన్, రాజ్‌కుమార్ హిరాణీ, జ్యోతి దేశ్‌పాండేలు నిర్మిస్తున్నారు. ఇందులో తాప్సీ పన్ను, విక్కీ కౌశల్ వంటి ప్రముఖులు కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రానికి ప్రీతమ్, అమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











