For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

షారుక్ ఖాన్‌కు మరో అరుదైన గౌరవం.. ఒబామా, మలాలా దారిలో

|

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ జీవితంలో మరో అరుదైన సంఘటన చోటుచేసుకోనున్నది. అమెరికాలోని ప్రముఖ టెలివిజన్ హోస్ట్, కమెడియన్ డేవిడ్ లెటర్‌మ్యాన్ నిర్వహించే కార్యక్రమంలో షారుక్ పాల్గొనననున్నారు. ఈ షోలో పాల్గొనేందుకు ఆయన ముంబై నుంచి న్యూయార్క్‌కు బయలుదేరి వెళ్లారు. నిరంతరం మెలుకువగా ఉంటే నగరానికి వెళ్తున్నాను. న్యూయార్క్ పిలుస్తోంది. ఓ ప్రముఖ షోలో పాల్గొనేందుకు వెళ్తున్నాను. ఆ షోలో పాల్గొనే మొట్టమొదటి భారతీయ నటుడిని నేను కావడం గర్వంగా ఉంది అని షారుక్ ట్వీట్ చేశారు.

డేవిడ్ లెటర్‌మ్యాన్ షోలో పాల్గొనడంపై అభిమానులు ఆనందోత్సావాలను వ్యక్తం చేస్తున్నారు. టెలివిజన్ టాక్ షో హోస్ట్‌గా, నిర్మాతగా, రచయితగా, కమెడియన్‌గా, అమెరికన్ టెలివిజన్ హోస్ట్‌గా గత 33 ఏళ్లుగా రాణిస్తున్న డేవిడ్ లెటర్ మ్యాన్ షోలో పాల్గొనే అవకాశం రావడంపై సంబురాలు జరుపుకొంటున్నారు.

Shah Rukh Khan to participate in David Letterman show

ఇటీవల కాలంలో డేవిడ్ లెటర్‌మ్యాన్ షో తొలి సీజన్‌లో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, జార్జ్ క్లూనీ, మలాలా యూసఫ్ జాయ్, జెర్రీ సీన్ ఫీల్డ్ లాంటి వాళ్లు పాల్గొనడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ ఉన్న హీరోగా పేరున్న షారుక్ ఖాన్‌ను ఈ టాక్ షోకు ఆహ్వానించడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. త్వరలోనే షారుక్ పాల్గొనే టాక్ షోను ప్రసారం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

అర్ధరాత్రి ప్రసారమయ్యే డేవిడ్ లెటర్‌మ్యాన్ షోకు ఇది రెండో సీజన్. ఈ ఇంటర్వ్యూ సిరీస్‌లు నెట్‌ఫ్లిక్స్‌లో కూడా ప్రసారం కానున్నాయి. ఈ కార్యక్రమానికి మై నెక్ట్స్ గెస్ట్ నీడ్స్ నో ఇంట్రడక్షన్ విత్ డేవిడ్ లెటర్‌మ్యాన్ అని పేరు పెట్టారు.

English summary
Bollywood badshah Shah Rukh Khan will soon appear on American television host and comedian, David Letterman’s show. The superstar has left from Mumbai to fly off to New York for the shoot of David Letterman’s show.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more