Don't Miss!
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- News
అమెరికాలో మరోసారి కాల్పులు: ముగ్గురు మృతి, నలుగురికి తీవ్రగాయాలు
- Sports
పని పాట లేని వెదవలు క్రియేట్ చేసే స్టోరీలు.. బాబర్ నాకు కొడుకుతో సమానం: వసీం అక్రమ్
- Finance
air india: చరిత్ర సృష్టించనున్న ఎయిర్ ఇండియా.. ప్రపంచంలో అలా చేస్తున్న మొదటి సంస్థ టాటానే..
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
వైష్ణోదేవీ ఆలయంలో షారుక్ ఖాన్.. మక్కా సందర్శన మరో తీర్థయాత్ర.. వీడియో వైరల్
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ వరుస చిత్రాలతో బిజీగా మారిపోయారు. షూటింగులతో ఓ పక్క బిజీగానే ఉంటూ.. మరో పక్క తీర్థయాత్రలు చూస్తూ వస్తున్నారు. పఠాన్ రిలీజ్‌కు ముందు హిందూ, ముస్లీం మతాలకు చెందిన ప్రార్థనా మందిరాలకు వెళ్లి దేవుళ్ల ఆశీస్సులు తీసుకొంటున్నాడు. ఇటీవల డంకీ సినిమా షూటింగ్ కోసం సౌదీ అరేబియాకు వెళ్లిన షారుక్.. మక్కాలోని ఉమ్రాకు వెళ్లి దేవుడి ఆశీస్సులు తీసుకొన్నాడు. ప్రస్తుతం డంకీ సినిమా కోసం కశ్మీర్ వెళ్లిన షారుక్.. వైష్ణోదేవీ ఆలయాన్ని సందర్శించారు.
వైష్ణోదేవీ ఆలయానికి వెళ్లిన సందర్భంలో తన సెక్యూరిటీ గార్డుల మధ్య నల్లటి హుడి కప్పుకొని వెళ్తున్న షారుక్ ఖాన్ వీడియోను అభిమానులు షేర్ చేస్తున్నారు. వైష్ణోదేవి ఆలయానికి వెళ్లిన షారుక్ ఖాన్ పర్యటనకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

ఇదిలా ఉండగా, జనవరి 25వ తేదీన పఠాన్ మూవీ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ప్రమోషనల్ కార్యక్రమాలు ఊపందుకొన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన బేషరమ్ అనే వీడియో లిరికల్ వీడియోను షేర్ చేశారు. దీపిక పదుకోన్ అందాల ఆరబోతతో పిచ్చెక్కింది.
Shah Rukh Khan reached Maa Vaishno Devi Temple to seek blessings 🤍#ShahRukhKhan𓀠 pic.twitter.com/M8OZpmlvz0
— Troll SRK Haters (@trollsrkhaters5) December 12, 2022
ఇదిలా ఉండగా, ప్రస్తుతం రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో రూపొందుతున్న డంకీ సినిమా షూటింగ్‌ను షారుక్ ఖాన్ పూర్తి చేసుకొన్నాడు. ఈ సినిమా షూట్ పూర్తి కాగానే.. మక్కా పవిత్ర ప్రాంతానికి వెళ్లి పూజలు చేశారు. ఆ తర్వాత వైష్ణోదేవి ఆలయానికి వెళ్లి పూజలు చేశారు. డంకీ, పఠాన్ సినిమాలతోపాటు జవాన్ మూవీలో కూడా నటిస్తున్నారు.