Dunki Drop 4 చరిత్ర సృష్టించిన డంకీ ట్రైలర్.. 24 గంటల్లో ఎన్ని కోట్ల వ్యూస్ అంటే?
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు సిద్దమయ్యారు. ఆయన నటించిన డంకీ చిత్రం డిసెంబర్ 21వ తేదీన రిలీజ్ కానున్నది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా డంకీ సినిమాకు సంబంధించిన ప్రోమోషనల్ వీడియోను డంకీ డ్రాప్ 4గా ప్రేక్షకుల ముందుకు తెచ్చారు.
హృదయాలను హత్తుకునే భావోద్వేగాలతో ప్రముఖ దర్శకుడు రాజ్‌కుమార్ హిరాని సినిమాను చక్కగా రూపొందించారనే విషయం ట్రైలర్ స్పష్టం చేసింది. షారుక్ ఖాన్, తాప్సీ, విక్కీ కౌశల్, తాప్సీ పన్ను, విక్రమ్ కొచ్చర్, అనీల్ గ్రోవర్, బోమన్ ఇరాని పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు హైలెట్‌గా మారనున్నది.

డంకీ డ్రాప్ 4 పేరుతో రిలీజ్ చేసిన ఈ సినిమా ట్రైలర్‌కు అనూహ్యమైన స్పందన లభిస్తున్నది. ఈ ట్రైలర్ 24 గంటల్లోనే 103 మిలియన్ల వ్యూస్ సాధించింది. విడుదలైన ప్రతీ ఫ్లాట్‌ఫామ్‌లో విశేషంగా ఆకట్టుకొంటున్నది. ఒక భాషలో ఇలా రికార్డు వ్యూస్ సాధించడం ఇదే మొదటిసారి కావడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నది.
పఠాన్, జవాన్ సినిమాల తర్వాత షారుక్ ఖాన్ నటించిన సినిమా కావడంతో డంకీ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ఏడాదిలోనే మూడు సినిమాలు రావడంతో అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. డంకీ సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
దర్శకుడు రాజ్ కుమార్ హిరాణి అందించిన ట్రైలర్‌లో ఎన్నో ఎమోషన్స్ కనిపించాయి. నలుగురి స్నేహితుల కథ, విదేశాలకు వెళ్లాలనే ప్రయత్నంలో వారి జీవితాల్లో ఎలాంటి సమస్యలు వచ్చాయి అనే డంకీ చిత్రంలో ప్రధాన అంశం. ఈ సినిమా ట్రైలర్ తాజాగా భారీ అంచనాలు నెలకొల్పింది. డిసెంబర్ 21వ తేదీన రిలీజ్ కోసం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.


Click it and Unblock the Notifications











