Dunki షారుక్ కెరీర్‌లోనే దారుణ అవమానం.. ఆ పాపులర్ థియేటర్‌లో నుంచి అవుట్.. సలార్ దెబ్బకు డంకీ ఢమాల్!
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్‌కు తొలిసారి దారుణమైన అవమానం ఎదురైంది. పఠాన్, జవాన్ బ్లాక్‌బస్టర్ సినిమాలతో ఊపు మీద ఉన్న ఆయనకు డంకీ చిత్రం చేదు అనుభవాన్ని మిగిల్చింది. విదేశాలకు భారతీయుల అక్రమ వలసల నేపథ్యంతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అయితే సలార్ సినిమాతో పోటీ పడలేక బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. దాంతో ఉత్తరాదిలో షారుక్ సినిమాను రెండో రోజే ఎత్తివేయడం ఇండస్ట్రీలో భారీ చర్చకు దారి తీసింది. ఈ వార్త వివరాల్లోకి వెళితే..
Recommended Video

క్రిస్మస్ పండుగ నేపథ్యంలో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద షారుక్ ఖాన్ నటించిన డంకీ, ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వచ్చిన సలార్ చిత్రం భారీగా పోటీ పడ్డాయి. ఈ రెండు సినిమా రిలీజ్‌కు ముందు థియేటర్ల కేటాయింపు విషయంలో వివాదం చెలరేగింది. డంకీ సినిమాకు ఎక్కువ స్క్రీన్లు కేటాయించి సలార్‌కు తక్కువ ఇవ్వడంతో గొడవ జరిగింది.

ఇక ముంబైలోని పాపులర్ థియేటర్ మరాఠా మందిర్ సినిమా షారుక్ ఖాన్‌కు లక్కీ థియేటర్‌గా చెప్పుకొంటారు. ఈ థియేటర్‌లోనే దిల్‌వాలే దుల్హానియా కొన్ని సంవత్సరాలుగా ఆడి రికార్డులు క్రియేట్ చేసింది. అలాంటి థియేటర్‌లో డంకీ మూవీకి ఎక్కువ షోలు కల్పించారు. అయితే ఈ థియేటర్‌లో సలార్ షోలకు అనుమతి ఇవ్వకపోవడంపై ఏకంగా థియేటర్ యజమాని తప్పు పట్టడం తెలిసిందే.
ఇక డంకీ సినిమా రిలీజ్ తర్వాత డిజాస్టర్ టాక్‌ను సొంతం చేసుకొన్నది. దాంతో ఈ సినిమాకు ప్రేక్షకులు ముఖం చాటేశారు. మరాఠా మందిర్ థియేటర్లలో ప్రదర్శిస్తున్న డంకీ సినిమా ఆడియెన్స్ లేకుండా బోసిపోయింది. దాంతో ఈ సినిమాను ఎత్తేసి సలార్ మూవీని ప్రదర్శిస్తుండటం బాలీవుడ్‌లో చర్చకు దారి తీసింది.

తాజా సమాచారం ప్రకారం.. మరాఠా మందిర్ సినిమా థియేటర్‌లో మూడు షోలు తీసేసి సలార్ సినిమాను వేశారు. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడం హిందీ నటుడికి ఇదే తొలిసారి. ఇలాంటి దారుణమైన పరిస్థితి షారుక్ ఖాన్ కెరీర్‌లోనే ఎప్పుడూ రాలేదు. బాలీవుడ్ బాద్షా ఎన్నో సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఎన్నోసార్లు పెద్ద సినిమాలతో పోటిపడ్డారు. కానీ ప్రభాస్ కొట్టిన దెబ్బ మాత్రం గట్టిగానే తగిలిందనే విషయం ముంబై మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతున్నది.


Click it and Unblock the Notifications











