twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Aryan Khan ‌కు బెయిల్ నిరాకరించిన ముంబై కోర్టు.. షారుక్‌ ఖాన్‌ ప్రయత్నాలు విఫలం

    |

    డ్రగ్స్ కేసులో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్‌కు ముంబై కోర్టు షాకిచ్చింది. ముంబై గోవా క్రూయిజ్‌లో డ్రగ్స్ పార్టీ జరుపుకొంటూ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులకు చిక్కిన షారుక్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ నిరాకరించింది. ఈ కేసులో బెయిల్ కోసం షారుక్ ఖాన్ కుటుంబం తీవ్రంగా ప్రయత్నించింది. అయితే దర్యాప్తు కొనసాగుతున్నందున ఆర్యన్‌కు బెయిల్ ఇవ్వడం కుదరదు అని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసు పూర్తి వివరాల్లోకి వెళితే..

    NDPS యాక్ట్‌ కింద కేసు నమోదు

    NDPS యాక్ట్‌ కింద కేసు నమోదు

    సోమవారం ఆర్యన్ ఖాన్‌ను ముంబై కోర్టులో ప్రవేశపెట్టారు. ఎన్సీబీ తరుపున అధికారి అనిల్ సింగ్ హాజరయ్యారు. ఆర్యన్ ఖాన్, మరో ఏడుగురిపై ఎన్‌డీపీఎస్ యాక్ట్ 8సీ, 20, 27, 35 సెక్షన్ల కింద కేసు బుక్ చేశామని వివరించారు. ఈ కేసు పిటిషన్‌ను పరిశీలించిన తర్వాత వాదనలు ప్రారంభించింది.

    బెయిల్ ఇవ్వండి అంటూ ఆర్యన్ లాయర్

    బెయిల్ ఇవ్వండి అంటూ ఆర్యన్ లాయర్

    డ్రగ్స్ కేసులో పట్టుబడిన అర్యన్ ఖాన్‌ను విడుదల చేయాలని ముంబైలోని ప్రముఖ లాయర్ సతీష్ మాన్‌షిండ్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. క్రూయిజ్ పార్టీకి సంబంధించి ఆర్యన్ ఖాన్ వద్ద టికెట్ లేదు, పార్టీలో వారికి ఎలాంటి క్యాబిన్ కేటాయించలేదు. కొందరు ఆహ్వానించడం వల్లే ఆర్యన్ అక్కడికి వెళ్లాడు.

    అతడికి బోర్డింగ్ పాస్ కూడా లేదు. వాట్సప్ చాటింగ్‌ను ఆధారంగా చేసుకొని అరెస్ట్ చేశారు. ఆర్యన్‌ అరెస్టుకు బలమైన ఆధారాలు లేవు అని సతీష్ మాన్‌షిండే తెలిపారు. గతంలో డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తి తరుఫున సతీష్ మాన్‌షిండే వాదనలు వినిపించిన సంగతి తెలిసిందే.

    అక్టోబర్ 7వ తేదీ వరకు కస్టడీ

    అక్టోబర్ 7వ తేదీ వరకు కస్టడీ

    ఆర్యన్ ఖాన్ తరపు న్యాయవాది సతీష్ మాన్‌షిండే వాదనలను తోసిపుచ్చుతూ గురువారం వరకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూర్ కస్టడీలో ఉండేలా ముంబై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. డ్రగ్స్ కేసులో దర్యాప్తు కీలకం. ఆ విచారణ సక్రమంగా జరుపాల్సిన అవసరం ఉంది. కస్టడీలో ఉండటం వల్ల నిందితుడికి, అధికారులకు మేలు జరుగుతుంది అని ముంబై కోర్టు న్యాయమూర్తి తన ఆదేశాల్లో పేర్కొన్నారు.

    షారుక్ ఫ్యామిలీ బెయిల్ ప్రయత్నాలు విఫలం

    షారుక్ ఫ్యామిలీ బెయిల్ ప్రయత్నాలు విఫలం

    తాజా డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్, అతడి స్నేహితుడు, నటుడు అర్బాజ్ మర్చంట్, ప్రముఖ వ్యాపారి కుమార్తె, ఫ్యాషన్ మోడల్ మున్‌మున్ దమేచా, నుపూర్ సతీజా, ఇష్మీత్ చద్దా, మోహన్ జైస్వాల్, గోమిత్ చోప్రాం, విక్రాంత్ చోకర్‌కు ఆక్టోబర్ 7వ తేదీ వరకు కస్టడీ విధించింది. దాంతో షారుక్ ఖాన్ ఫ్యామిలీ చేసిన బెయిల్ ప్రయత్నాలు బెడిసికొట్టాయి.

    Recommended Video

    Surekha Sikri Life Story, నేషనల్ అవార్డ్ నటి.. Naseeruddin Shah కి బంధువు!! || Filmibeat Telugu
    షారుక్ ఖాన్‌కు సల్మాన్ ఖాన్ కుటుంబం ఓదార్పు

    షారుక్ ఖాన్‌కు సల్మాన్ ఖాన్ కుటుంబం ఓదార్పు

    ప్రస్తుతం పరిస్థితుల్లో పలువురు సినీ ప్రముఖులు షారుక్ ఖాన్‌ నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. గత అర్ధరాత్రి సల్మాన్ ఖాన్ స్వయంగా వెళ్లి షారుక్‌ను ఓదార్చాడు. సోమవారం ఉదయం సల్మాన్ ఖాన్ సోదరి అల్వీరా ఖాన్ కూడా వెళ్లి షారుక్ ఖాన్ కుటుంబాన్ని పరామర్శించారు.

    English summary
    Bollywood Super Star Shah Rukh Khan’s son Aryan Khan sent to NCB remand till October 7 in drugs probe.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X