twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఈ సినిమా కూడా ప్లాప్ అయితే.. నేను సరైన హిట్ కొట్టి 15ఏళ్ళు అవుతోంది!

    |

    బాలీవుడ్ బాద్షా అంటే పిచ్చెక్కిపోయే అభిమానులు ఉన్నారు. దశాబ్దాల కాలంగా తన నటన, ప్రత్యేకమైన స్టైల్ తో షారుఖ్ అభిమానులని అలరిస్తున్నాడు. షారుఖ్ నటించిన తాజా చిత్రం జీరో డిసెంబర్ 21న విడుదల కానుంది. షారుఖ్ ఈ చిత్రంలో శారీరక వైకల్యం ఉన్న యువకుడిపాత్రలో నటిస్తున్నాడు. కత్రినా కైఫ్, అనుష్క శర్మ నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ప్రస్తుతం జీరో చిత్ర ప్రచార కార్యక్రమాల్లో షారుఖ్ బిజీగా పాల్గొంటున్నాడు. జీరో చిత్రం గురించి, తన సినిమా కెరీర్ గురించి షారుఖ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరమైన చర్చకు దారితీసాయి.

    వెంటాడుతున్న పరాజయాలు

    వెంటాడుతున్న పరాజయాలు

    బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ కు పరాజయాల బెడద తప్పడం లేదు. గత కోనేళ్ళుగా షారుఖ్ నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా నిరాశపరుస్తున్నాయి. రాయీస్, ఫ్యాన్, దిల్ వాలే లాంటి చిత్రాలు తీవ్రంగా నిరాశపరిచిన సంగతి తెలిసిందే. ఇంతియాజ్ అలీ దర్శత్వంలో తెరకెక్కిన జబ్ హ్యారీమెట్ సెజల్ చిత్రం 90 కోట్ల భారీ బడ్జెట్ లో తెరకెక్కి కేవలం 60 కోట్ల వసూళ్లకు మాత్రమే పరిమితం అయింది.

    జీరోపై భారీ అంచనాలు

    జీరోపై భారీ అంచనాలు

    ఎన్ని పరాజయాలు ఎదురైనా షారుఖ్ సినిమాల జోరు మాత్రం తగ్గడం లేదు. ప్రతి ఏడాది ఒకటో రెండో సినిమాలతో షారుఖ్ ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. విభిన్నమైన కథతో తెరకెక్కిన జీరో చిత్రంపై షారుఖ్ భారీగా ఆశలు పెట్టుకుని ఉన్నాడు. అభిమానుల్లో కూడా ఈ చిత్రంపై అంతే క్రేజ్ నెలకొంది ఉంది. తన కెరీర్ కు చాలా కీలకమైన చిత్రం గురించి ఓ ఇంటర్వ్యూలో షారుఖ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

    ఈ సినిమా ప్లాప్ అయితే

    ఈ సినిమా ప్లాప్ అయితే

    నేను అభిమానులకు సరైన హిట్ అందించి 15 ఏళ్ళు గడుస్తోంది. భారీ విజయం కోసం ప్రయత్నిస్తున్నాను కానీ కుదరడం లేదు అని షారుఖ్ తెలిపాడు. శుక్రవారం విడుదల కాబోతున్న జీరో చిత్ర ఫలితం ఎలా ఉండబోతోందో కూడా నాకు తెలియదు. వచ్చే ఫలితాన్ని నేను మార్చలేను. కాబట్టి సినిమాల ఫలితం గురించి తానెప్పుడూ బెంగ పెట్టుకొనని షారుఖ్ అన్నారు. జీరో చిత్రం ఫెయిల్ అయితే ఏమవుతుంది.. మహా అయితే 6 నుంచి 10 నెలల పాటు ఖాళీగా ఉంటాను అంతే అని షారుఖ్ అన్నారు.

    నా నైపుణ్యం

    నా నైపుణ్యం

    నా నైపుణ్యానికి, నటనకు విలువ ఉన్నన్ని రోజులు సినిమా చేస్తూనే ఉంటానని షారుఖ్ తెలిపారు. ఆనంద్ ఎల్ రాయ్ ఈ చిత్రానికి దర్శకుడు. కత్రినా కైఫ్ ఈ చిత్రంలో మద్యానికి బానిసైన నటి పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక అనుష్క శర్మ సైంటిస్ట్ పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

    English summary
    Shah Rukh Khan on Zero: If This Film Doesn't Work, Maybe I Won't Get Work for 6 or 10 Months. Shah Rukh Khan's last film Jab Harry Met Sejal with director Imtiaz Ali had evoked a lot of expectations among the audiences, but the film turned out to be a disaster.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X