ప్రతీ రాత్రి జాల్సా బయటే... మీరు ఎప్పుడంటే అప్పుడే.. బిగ్‌బీకి షారుక్‌కు ఝలక్
సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ ఎదుటి వాళ్లను ఆటపట్టించడంలో తనకో మార్కు ఉంటుందని సినీ వర్గాలు చెప్పుకొంటారు. ఎప్పుడు విరిచి పడేసినట్టు మాట్లాడే మాటలతో హాస్యాన్ని పండిస్తుంటారనే విషయం పలు మీడియా సమావేశాల్లో అనుభవమే. అలాంటి సంఘటనే తాజాగా కనిపించింది. కానీ ఈ సారి సూపర్‌స్టార్ షారుక్ ఖాన్ చేతిలో బిగ్ బీ బాధితుడు కావడం ఇందులో తమషా. అసలు ఏం జరిగిందంటే..

రూ.100 కోట్లు.. బిగ్‌బీ ట్వీట్
అమితాబ్ బచ్చన్ నటించిన బద్లా చిత్రం గుట్టుచప్పుడు కాకుండా బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లు కొల్లగొట్టింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని బిగ్ బీ తనదైన మార్కులో ట్విట్టర్‌లో స్పందించారు. బద్లా సినిమాను 100 కోట్ల క్లబ్‌లో చేర్చినందుకు కేవలం నిర్మాత, డిస్టిబ్యూటర్, లేదా లైన్ ప్రొడ్యూసర్, మరే ఇతర వ్యక్తికో కాకుండా.. అందరికీ ఓ క్షణం వృధా చేయకుండా అభినందనలు తెలుపుతున్నాను అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

ప్రతీ రోజు మీ ఇంటి బయటే ఉన్నాం
అమితాబ్ బచ్చన్ ట్వీట్‌కు షారుక్ ఖాన్ స్పందిస్తూ.. ఇంతటి సంతోషకరమైన వార్తను చెప్పినందుకు పార్టీ ఎప్పుడిస్తారని నేను డిమాండ్ చేస్తున్నాం. మేము మీ విందు కోసం చాలా ఎదురుచూస్తున్నాం. మీరు పార్టీకి ఎప్పుడు పిలుస్తారేమోనని ప్రతీ రాత్రి మీ ఇల్లు జాల్సా ముందు వేచి చూస్తున్నాం అని షారుక్ ట్వీట్ చేశారు. బాద్లా చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైనర్‌మెంట్ బ్యానర్‌పై షారుక్ ఖాన్ రూపొందించిన సంగతి తెలిసిందే.

బిగ్‌బీ, షారుక్ ఖాన్ మధ్య రిలేషన్స్
ఇక వ్యక్తిగత విషయాలకు వస్తే.. బిగ్ బీ, షారుక్ కుటుంబాల మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. అమితాబ్ అంటే షారుక్‌కు ఎనలేని గౌరవం. షారుక్ కుమారుడు అబ్‌రామ్ తాత అని ముద్దుగా పిలుచుకొంటారు. వ్యక్తిగతంగానే కాకుండా ప్రొఫెషనల్‌గా అమితాబ్, షారుక్ మధ్య మంచి రిలేషన్స్ ఉన్నాయి. వారిద్దరు కలిసి మెహబ్బతే, కభీ కుషీ కభీ ఘమ్ చిత్రాల్లో నటించారు.

31 రోజుల్లో రూ.100 కోట్లు
షారుక్ ఖాన్ నిర్మాణ సారథ్యంలో రూపొందిన బద్లా చిత్రం ప్రపంచవ్యాప్తంగా 31 రోజుల్లో రూ.130 కోట్లు వసూలు చేసింది. దేశీయంగా ఈ చిత్రం రూ.100 కోట్ల గ్రాస్, 85 కోట్ల నికర వసూళ్లను రాబట్టింది. నెల తర్వాత కూడా ఈ చిత్రం భారీగా కలెక్షన్లు సాధిస్తున్నది.


Click it and Unblock the Notifications











