విజయ్ దేవరకొండే అనుకుంటే.. ఇతడు ఇంకా పిచ్చోడిలా ఉన్నాడే!

Recommended Video

Arjun Reddy's Hindi Remake : Shahid Kapoor's Get Up Goes Viral | Filmibeat Telugu

టాలీవుడ్ నయా సెన్సేషన్ విజయ్ దేవరకొండకు ఇంత క్రేజ్ ఏర్పడడానికి ఆజ్యం పోసిన చిత్రం అర్జున్ రెడ్డి. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ నటన, గెటప్ యువతకు బాగా నచ్చేశాయి. అర్జున్ రెడ్డి సాధించిన విజయం అన్ని చిత్రపరిశ్రమల్లో హాట్ టాపిక్ గా మారింది. చిన్న చిత్రంగా ప్రేక్షుకుల ముందుకు వచ్చిన అర్జున్ రెడ్డి ఎవరూ ఊహించని విధంగా కళ్ళు చెదిరే వసూళ్లు రాబట్టింది. దీనితో ఈ చిత్ర రీమేక్ హక్కులు సొంతం చేసుకునేందుకు హిందీ, తమిళ నిర్మాతలు ఎగబడ్డారు. ప్రస్తుతం ఈ చిత్ర తమిళ రీమేక్ లో విక్రమ్ తనయుడు ధృవ్ నటిస్తున్నాడు. హిందీలో స్టార్ హీరో షాహిద్ కపూర్ నటిస్తుండగా ఈ చిత్రానికి అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగనే దర్శత్వం వహిస్తున్నాడు.

కబీర్ సింగ్

కబీర్ సింగ్

హిందీ రీమేక్ కు కబీర్ సింగ్ అనే టైటిల్ ఖరారు చేశారు. షాహిద్ కపూర్, సందీప్ వంగ జత కట్టడంతో అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ పై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అర్జున్ రెడ్డి చిత్రం గురించి వినగానే ఈ చిత్రాన్ని చూశానని ఓ ఇంటర్వ్యూలో షాహిద్ కపూర్ తెలిపాడు. రిపీటెడ్ గా ఈ చిత్రాన్ని చాలా సార్లు చూశానని షాహిద్ తెలిపాడు.

వ్యసనపరుడిగా

వ్యసనపరుడిగా

అర్జున్ రెడ్డి చిత్రంలో విజయ్ దేవరకొండ గెటప్, నటన ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. వ్యసనపరుడైన డాక్టర్ పాత్రలో విజయ్ దేవరకొండ మైమరపించేలా నటించాడు. గుబురు గడ్డం, చిందరవందర జుట్టుతో విజయ్ దేవరకొండ విభిన్నంగా కనిపించాడు. ఇప్పుడు ఇదే ఫార్ములాని తమిళ, హిందీ రీమేక్స్ లో వాడుతున్నారు.

మరీ పిచ్చోడిలా

మరీ పిచ్చోడిలా

డ్రగ్స్, మద్యం లాంటి వ్యసనాలకు బానిసగా విజయ్ దేవరకొండ నటన కొన్ని సన్నివేశాల్లో తీవ్రంగా ఉంటుంది. కబీర్ సింగ్ లో షాహిద్ కపూర్ నటన తీవ్రత ఇంకా ఎక్కువగా ఉండబోధ్నట్లు తెలుస్తోంది. తాజాగా కబీర్ సింగ్ లో షాహిద్ కపూర్ లుక్ వైరల్ అయి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ గెటప్ షాహిద్ కపూర్ కు బాగా సూట్ అయిందని అంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే షాహిద్ కపూర్ పిచ్చోడిలా కనిపిస్తున్నాడు. గుబురు గడ్డం, బాగా పీల్చుకుపోయిన ముఖంతో అతడి లుక్ చాలా ఆసక్తిగా ఉంది.

అర్జున్ రెడ్డిని మించేలా

అర్జున్ రెడ్డిని మించేలా

ఇటీవల దర్శకుడు సందీప్ వంగ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అర్జున్ రెడ్డి కన్నా కబీర్ సింగ్ లో ఎమోషన్ మరింత బలంగా ఉండబోతోంది. అర్జునరెడ్డి చిత్రం అందించిన ఉత్సాహంతో కబీర్ సింగ్ ని మరింత ఆత్మవిశ్వాసంతో తెరకెక్కిస్తానని సందీప్ వంగ తెలిపారు. అర్జున్ రెడ్డి చిత్రం కేవలం 5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి కళ్ళు చెదిరే లాభాలు తెచ్చిపెట్టింది. హిందీ రీమేక్ ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X