'కబీర్ సింగ్' ఎఫెక్ట్.. లాభపడింది వాళ్ళే, నా డబ్బే రాలేదు.. షాహిద్ కపూర్ షాకింగ్ కామెంట్స్

Recommended Video

Shahid Kapoor Responds On The Rumours About His Remuneration || Filmibeat Telugu

తెలుగులో అర్జున్ రెడ్డి సినిమాకు హిందీ రీమేక్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది కబీర్ సింగ్. ఈ సినిమాలో షాహిద్ కపూర్, కియారా అద్వానీ జంటగా నటించారు. వీరిద్దరి కెమిస్ట్రీ, తెలుగు అర్జున్ రెడ్డి లాగే లిప్‌లాక్స్ కబీర్ సింగ్ సినిమాలో హైలైట్ అయ్యాయి. అచ్చం తెలుగులో లాగే కబీర్ సింగ్ పై కూడా వివాదాలు చుట్టుముట్టాయి. అయితే వీటన్నింటినీ అధిగమిస్తూ కలెక్షన్ల సునామీ సృష్టించింది కబీర్ సింగ్ సినిమా. హీరో హీరోయిన్లకు మంచి క్రేజ్ వచ్చేసింది. దీంతో షాహిద్ కపూర్ ప్రవర్తనలో చాలా తేడా వచ్చిందని, రెమ్యూనరేషన్ అమాంతం పెంచేశాడని రకరకాల రూమర్స్ వినిపించాయి. తాజాగా ఈ ఇష్యుపై స్పందించాడు షాహిద్. వివరాల్లోకి పోతే..

షాహిద్ క‌పూర్‌లో బిగ్గెస్ట్ హిట్

షాహిద్ క‌పూర్‌లో బిగ్గెస్ట్ హిట్

తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన 'కబీర్ సింగ్' సినిమా అంచనాలను మించి రెస్పాన్స్ తెచ్చుకుంది. బాలీవుడ్ బాక్సాఫీస్‌ని షేక్ చేస్తూ ఈ ఏడాది భారీ వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. పైగా షాహిద్ కపూర్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ సినిమాగా నిలిచింది. అడల్ట్ స్టోరీ అయినపప్పటికీ షాహిద్ నటనకు ఫిదా అయ్యారు బీ టౌన్ పబ్లిక్.

50 కోట్లు పెడితే 300 కోట్లు

50 కోట్లు పెడితే 300 కోట్లు

కబీర్ సింగ్ సినిమాను 50 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కించగా.. విడుదలయ్యాక రికార్డులు తిరగరాస్తూ 300 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టింది. దీంతో డైరెక్టర్ సందీప్, హీరో షాహిద్ డిమాండ్ బాగా పెరిగిందనే టాక్ వచ్చేసింది. ఈ మేరకు షాహిద్ కపూర్ తన తదుపరి సినిమాల కోసం ఏకంగా 40 కోట్ల రెమ్మ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నాడనే వార్తలు వచ్చాయి.

షాహిద్‌ని కరణ్ సంప్రదించగా..

షాహిద్‌ని కరణ్ సంప్రదించగా..

తెలుగులో నాని హీరోగా వచ్చి సూపర్ హిట్ సాధించిన 'జెర్సీ' సినిమా రీమేక్‌లో హీరోగా చేయాలని షాహిద్ కపూర్‌ని సంప్రదించగా 40 కోట్లు అడిగాడనే టాక్ బయటకు వచ్చింది. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బడా నిర్మాత కరణ్ జోహార్ ఈ సినిమాకు రీమేక్ చేయాలని భావిస్తున్నట్లుగా సమాచారం.

 'కబీర్ సింగ్' డబ్బే రాలేదు.. అప్పుడే

'కబీర్ సింగ్' డబ్బే రాలేదు.. అప్పుడే

తాజాగా తన పారితోషికం విషయమై వస్తున్న రూమర్స్‌పై ఆసక్తికరంగా స్పందించాడు షాహిద్. ఇంకా తనకు కబీర్ సింగ్ సినిమా పారితోషికమే రాలేదని, కబీర్ సింగ్ ముందు బ్యాంకు బ్యాలెన్స్ ఎంత ఉందో ఇప్పుదు కూడా అంతే ఉందని, అప్పుడే ఇలాంటి రూమర్స్ బయటకు రావడం ఆశ్చర్యంగా ఉందని అన్నాడు.

లాభపడింది వాళ్ళే.. ఆ డబ్బు రావాలంటే

లాభపడింది వాళ్ళే.. ఆ డబ్బు రావాలంటే

కబీర్ సింగ్ సినిమా వల్ల లాభపడింది కేవలం సినిమా నిర్మాతలే అని, తనకు కబీర్ సింగ్ పారితోషికం రావాలంటే మరో సినిమాకు సంతకం చేయాలని ఆయన చెప్పాడు షాహిద్ కపూర్. దీన్ని బట్టి చూస్తే ఆయన కబీర్ సింగ్ దర్శకనిర్మాతలతో మరో సినిమా చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. మొత్తానికైతే తనపై వస్తున్న రూమర్స్‌కి ఈ రకంగా ఫుల్‌స్టాప్ పెట్టేశాడు షాహిద్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X