నాని సినిమా కోసం రూ.40 కోట్ల రెమ్యునరేషన్.. చుక్కలు చూపిస్తున్న హీరో!
Recommended Video
కబీర్ సింగ్ చిత్ర విజయంతో బాలీవుడ్ హీరో షాహీద్ కపూర్ మంచి జోష్ మీద కనిపిస్తున్నాడు. సక్సెస్ అందించిన హుషారుతో లెక్కకు మంచి రెమ్యునరేషన్ పెంచేసినట్టు వార్తలు వచ్చాయి. తాజాగా తెలుగులో ఘన విజయం సాధించిన జెర్సీ సినిమా రీమేక్ విషయంలో సంప్రదించగా నిర్మాతలకు చుక్కలు చూపించినట్టు బాలీవుడ్ మీడియా కోడై కూస్తున్నది. ఇంతకు షాహీద్ కపూర్ ఏ మేరకు తన రెమ్యునరేషన్‌ను డిమాండ్ చేశారంటే..

కబీర్ సింగ్ సక్సెస్‌తో
షాహీద్ కపూర్ కెరీర్ విషయానికి వస్తే.. కబీర్ సింగ్‌కు ముందు ఆయనకు ఉన్న సక్సెస్ అంతంత మాత్రమే. కబీర్ సింగ్ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ను హడలెత్తించింది. ఏకంగా రూ.200 కోట్ల వసూళ్లకుపైనే సాధించింది. ఈ క్రమంలో తన ముందుకు వచ్చిన ఆఫర్లకు షాహీద్ కపూర్ భారీ పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. తాజాగా జెర్సీ రీమేక్ విషయంలో కూడా ఇదే జరిగిందట.

క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌తో జెర్సీ
ఇటీవల టాలీవుడ్‌లో విడుదలై భారీ విజయాన్ని అందుకొన్న చిత్రాల్లో జెర్సీ ఒకటి. నేచురల్ స్టార్ నానీ నటించిన ఈ చిత్రం క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందింది. శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్‌గా హరీష్ కల్యాణ్, సత్యరాజ్ తదితరులు నటించారు. ఈ సినిమా విజయ సాధించడంతో బాలీవుడ్‌లో రూపొందించేందుకు హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ సొంతం చేసుకొన్నది.

రీమేక్ హక్కుల కోసం ఎంతంటే
జెర్సీ రీమేక్ గురించి ట్రేడ్ వర్గాలు వెల్లడించిన ప్రకారం.. నాని నటించిన ఈ సినిమా హక్కుల కోసం రూ.30 కోట్లు చెల్లించినట్టు సమాచారం. అయితే కబీర్ సింగ్ తర్వాత ఈ సినిమాలో నటించమని షాహీద్‌ను కోరితే రూ.40 కోట్లు రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్టు పేర్కొంటున్నారు. షాహీద్ డిమాండ్ విన్న నిర్మాతలు అవాక్కవ్వడం జరిగిందంట. అయితే ఆ సినిమాలో నిర్మాతలు షాహీద్‌ను తీసుకుంటారా లేదా అనే వచే చూడాల్సిందే.

రూ.300 కోట్ల క్లబ్ వైపు కబీర్ సింగ్
ఇక కబీర్ సింగ్ కలెక్షన్ల విషయానికి వస్తే.. ఈ చిత్రం రూ.300 కోట్లకు చేరువైంది. ఐదు వారాల్లో కలిపి ఈ చిత్రం రూ.271 కోట్లు వసూలు చేసింది. తొలివారం రూ.134.42 కోట్లు, రెండోవారం రూ.78.78 కోట్లు, మూడో వారం రూ.36.40 కోట్లు, నాలుగో వారం రూ.16.66 కోట్లు, ఐదో వారం రూ.4.98 కోట్లు వసూలు చేసింది.


Click it and Unblock the Notifications











