For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రెమ్మ్యూనరేషన్ అమాంతం పెంచేసిన షాహిద్ కపూర్.. మీ కారణంగానే ఇదంతా అంటూ

|

సినీ ఇండస్ట్రీలో దశ తిరగాలంటే ఓకే ఒక్క సినిమా చాలు అని ఇప్పటికే పలు చిత్రాల ద్వారా రుజువైంది. కొందరు హీరోలకు ఎన్ని సినిమాలు చేసినా దక్కని విజయం ఊహించని రీతిలో ఒకే ఒక్క సినిమాతో దక్కుతుంది. తాజాగా బాలీవుడ్‌లో విడుదలై భారీ సక్సెస్ సాధించిన కబీర్ సింగ్ సినిమా విషయంలోనూ అదే జరిగింది. దీంతో ఈ సినిమాలో నటించిన హీరోయిన్లకు అమాంతం క్రేజ్ పెరిగిపోయింది.

షాహిద్ కపూర్ హీరోగా కబీర్ సింగ్ సినిమా తెరకెక్కింది. తెలుగులో విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసిన అర్జున్ రెడ్డి సినిమాకు రీమేక్ సినిమాగా ఈ చిత్రాన్ని రూపొందించాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. చిత్రంలో షాహిద్ కపూర్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ఊహించిన దాన్ని మించిన రెస్పాన్స్ తెచ్చుకుంది. భారీ కలెక్షన్స్ రాబడుతూ ఇప్పటికే 200 కోట్ల క్లబ్‌లో చేరిపోయి 300 కోట్ల దిశగా పరుగులు పెడుతోంది. అయితే ఈ సినిమా అందించిన విజయంతో హీరో షాహిద్ కపూర్ తన రెమ్మ్యూనరేషన్ అమాంతం పెంచేశాడనే టాక్ వినిపిస్తోంది బీ టౌన్ ప్రేక్షకుల్లో.

Shahid Kapoor hiked his Remuneration After Kabir Singh

కబీర్ సింగ్ విజయంతో ఖుషీ ఖుషీగా ఉన్న షాహిద్.. తన తదుపరి సినిమాల కోసం ఏకంగా 35 కోట్ల రెమ్మ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నాడట. బాలీవుడ్ సర్కిల్స్‌లో గుప్పుమంటున్న ఈ వార్త గనక నిజమైతే బాలీవుడ్ చిత్రసీమలో అత్యధిక రెమ్మ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోల్లో ఒకరిగా నిలుస్తాడు షాహిద్ కపూర్. ఇక కబీర్ సింగ్ సక్సెస్ అయి 200 కోట్ల క్లబ్‌లో చేరిన సందర్బంగా సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు షాహిద్ కపూర్. ''ప్రేక్షకులు అందించిన ఈ విజయం చూస్తుంటే ఆనందంగా ఉంది. మీ పై నా ప్రేమను చూపించడానికి మాటలు చాలవు.

ఈ విజయంలో మీరంతా భాగస్వాములే. మీరు చూపుతున్న ఈ ఆదరణకు కృతజ్ఞుడనై ఉంటాను. సినిమా అనేది జీవితాన్ని ప్రతిబింబించేదిగా ఉండాలని నేను కోరుకుంటాను. కబీర్ సింగ్ కథలో మీరంతా హీరోలే'' అని పేర్కొన్నాడు షాహిద్ కపూర్. మరోవైపు ప్రేమికులను ఉద్దేశిస్తూ కబీర్ సింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

English summary
Recently released Kabir Singh movie running successfully. After the success of Kabir Singh, Shahid has hiked his Remuneration. Rumour has it that he will charge around 35 crore for his upcoming movies. If this is true, then he would be one of the highest-paid actors in Bollywood.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more