ఆ సీన్ల తర్వాత.. 2 గంటల స్నానం.. చాలా కష్టమైంది.. హిందీ ‘అర్జున్ రెడ్డి’ గురించి షాహీద్
తెలుగులో సంచలన విజయం నమోదు చేసుకొన్న అర్జున్‌రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్ మూవీ టీజర్‌కు అనూహ్య స్పందన లభిస్తున్నది. దాంతో కబీర్ సింగ్ కూడా మాస్టర్ పీస్ అయ్యే అవకాశం ఉందనే మాట వినిపిస్తున్నది. కబీర్ సింగ్‌కు అనూహ్యమైన స్పందన లభిస్తున్న నేపథ్యంలో హీరో షాహీద్ కపూర్ ఈ సినిమా అనుభవాలను మీడియాతో పంచుకొన్నారు. షాహీద్ కపూర్ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..

సీన్ టూ సీన్ కాపీ చేయలేదు
అర్జున్ రెడ్డి లాంటి సినిమాను రిమేక్ చేయడం సవాల్‌తో కూడినది. అత్యంత కష్టమైన పని. ఆ సినిమాను ప్రేక్షకులు బాగా ఆదరించారు. అలా అని ఆ సినిమాను సీన్ టూ సీన్ కాపీ చేయడం వల్ల ప్రయోజనం ఉండదు. కొత్తగా ప్రజెంట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది మా యూనిట్ అభిప్రాయం. అందుకే ఆ సినిమాను కొత్తగా ప్రజెంట్ చేశాం. ఇప్పటికే చూసిన ప్రేక్షకులకు చాలా థ్రిల్లింగ్ ఉంటుంది అని షాహీద్ కపూర్ చెప్పారు.

రోజుకు 20 సిగరెట్లు తాగా
కబీర్ సింగ్ షూటింగ్ కోసం రోజుకు 20 సిగరెట్లు తాగాల్సి వచ్చింది. అలా సిగరెట్లు తాగడం చాలా కష్టంగా అనిపించింది. ఈ సీన్లలో నటించిన తర్వాత రెండు గంటలపాటు స్నానం చేసి ఇంటికి వెళ్లే వాడిని. సిగరెట్ పొగ వాసనతో నా పిల్లలు కష్టపడకుండా అలా చేసేవాడిని. నాకు ఇష్టం లేకపోయినా పాత్ర కోసం సిగరెట్లు ఎక్కువగా తాగాను అని షాహీద్ కపూర్ అన్నారు.

అలాంటి వాటిని ఎంకరేజ్ చేయను
ధూమపానం వస్తువులను ప్రమోట్ చేయడం, అలాంటి ప్రొడక్ట్‌లకు ఎండార్స్ చేయడం నాకు ఇష్టం ఉండదు. పాత్ర డిమాండ్ చేయాల్సి రావడంతో తప్పనిసరిగా నేను సిగరెట్లు తాగాను అని షాహీద్ కపూర్ తెలిపారు. ఈ చిత్రంలో డ్రగ్స్, మద్యం, ధూమపానానికి వ్యసనపరుడైన మెడికల్ స్టూడెంట్ పాత్రను షాహీద్ పోషిస్తున్న సంగతి తెలిసిందే.

జూన్ 21న కబీర్ సింగ్ రిలీజ్
గతంలో ఇదే తరహా పాత్రను పోలీ ఉండే రోల్‌లో ఉడ్తా పంజాబ్ చిత్రంలో నటించాడు. డ్రగ్స్‌కు బానిసైన రాక్‌స్టార్‌గా షాహీద్ ఆ చిత్రంలో కనిపించాడు. ఇప్పుడు లాంటి ఇంటెన్సీవ్ పాత్రలో కబీర్ సింగ్‌గా కనిపించనున్నారు. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం ఈ చిత్రంలో షాహీద్‌కు జంటగా కియారా అద్వానీ నటించారు. తెలుగులో ఈ పాత్రను షాలిని పాండే పోషించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం జూన్ 21న ప్రేక్షకుల ముందుకు రానున్నది.


Click it and Unblock the Notifications











