For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  షాహిద్-మీరాల బంధానికి ఐదేళ్లు.. మొదటి సారి ఫౌంహౌస్‌లో.. ఏడు గంటలు అలా!!

  |

  బాలీవుడ్ క్యూట్ కపూల్స్‌లో షాహిద్ కపూర్-మీరా రాజ్‌పుత్ జంట కూడా ఉంటుంది. వీరిద్దరి అన్యోన్యత గురించి తెలియాంటే వీరి సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవ్వాల్సిందే. వెండితెరపై కలిసి సందడి చేయకపోయినా గానీ బుల్లితెరపై ప్రకటనల్లో ఇద్దరూ నటించి అందర్నీ ఆకట్టుకున్నారు. షాపిద్ కపూర్ కంటే మీరాయే సెన్సేషనల్ కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటుంది. ఆ మధ్య ఓ షోలో పాల్గొంటూ బెడ్రూమ్ సీక్రెట్స్ కూడా చెప్పేసింది. వీరిద్దరి వివాహా బంధానికి నేటికి ఐదేళ్లు నిండాయి. ఈ సందర్భంగా వీరిద్దరి ప్రేమాయణం, వీరిద్దరి అన్యోన్యతకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

  తొలి పరిచయం..

  తొలి పరిచయం..

  షాపిద్ కపూర్-మీరాలకు 2015లో జూన్ 7న వివాహం అయింది. అయితే వీరి తొలిచూపులు ఎలా జరిగాయి? అప్పుడు ఏం జరిగింది? ఇద్దరూ ఏం అనుకున్నారు? అనే విషయాలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. గతంలో వీరిద్దరూ చెప్పిన సంగతులు సోషల్ మీడియాలో ప్రస్తుతం చక్కర్లు కొడుతున్నాయి. ఈ జంట ఇంతగా ఫేమస్ కావడనికి వీరిద్దరి మధ్య 13ఏళ్లు వయోబేధం ఉండటం కూడా ఓ కారణమే.

  అలా మొదటి సారి..

  అలా మొదటి సారి..

  షాహిద్-మీరా కుటుంబాలు ఓ సారి ఢిల్లీలో ఓ ఈవెంట్‌లో కలిశారు. షాహిద్ తన ఫ్రెండ్ ఫాంహౌస్‌లో ఏర్పాటు చేసిన మ్యూజిక్ కాన్సర్ట్‌కు అంతా వెళ్లారట. ఆ సమయంలో వీరిద్దరూ ఒకరినొకరు చూసుకున్నారట. అప్పుడే వీరికి తొలి పరిచయం జరిగిందట. ఆ సమయంలో ఇద్దరూ కూడా మాట్లాడుకున్నారట.

  ఏడు గంటల పాటు..

  ఏడు గంటల పాటు..

  ఆ నాటి విశేషాలను షాహిద్ పలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఫస్ట్ టైమ్ మీర్జాను చూసినప్పుడు ఏం అనుకున్నాడు? ఎంత సేపు మాట్లాడాడు? ఇలాంటి విషయాలన్నీ చెప్పుకొచ్చాడు. దాదాపు ఏడు గంటల పాటు ఆరోజు ఇద్దరూ మాట్లాడుకుంటూనే ఉన్నారట. అలా ఫాంహౌస్‌లో నడుచుకుంటూ వెళ్లారట. అయితే ఆ సమయంలో సూర్యుడు ఆమె వెనకాల ఉన్నాడట.

  సిగ్గులేదారా?

  సిగ్గులేదారా?

  ఆ సమయంలో ఆమె కళ్లను చూశాడట. మరీ అంత డార్క్ కాదని అనుకున్నాడట. అందులో ఏదో ఉందని అనిపించిందట. ఆమెనే చేసుకోవాలని అప్పుడు అనిపించిందటా. ‘అరే ఏం ఆలోచిస్తున్నావ్.. ఆమెకు ఇరవై యేళ్లు కూడా లేవు... నీకు సిగ్గులేదారా' అని తనలో తాను అనుకున్నాడట.

  నేనే అదృష్టవంతురాలిని..

  నేనే అదృష్టవంతురాలిని..

  తాజాగా తమ బంధానికి ఐదేళ్లు నిండటంతో మీరా ఎమోషనల్ అయింది. ఈ మేరకు సోషల్ మీడియాలో స్పందిస్తూ.. ‘ఐదేళ్లు, నాలుగు ఆత్మలు.. మూడు ఇళ్లులు, ఇద్దరు సంతానం ఒక్క అందమైన కుటుంబం. ఈ ప్రేమ ప్రయాణంలో మీకంటే ఎక్కువగా ఎవ్వరూ లేరు. నేను ప్రతిరోజూ మీతో ఇంకా ఎక్కువగా ప్రేమలో పడుతూనే ఉంటున్నాను. నా జీవితంలో ఈ ప్రేమే నాకు మంచి స్నేహితుడిగా దొరికినందుకు ఈ ప్రపంచంలోనే అదృష్టవంతురాలిని.

  Nepotism పై Renu Desai హాట్ కామెంట్స్‌!
  గోల్డెన్ వర్డ్స్..

  గోల్డెన్ వర్డ్స్..

  నీవు నాకోసం చేసిన ప్రతిదానికీ, నాతో కలిసి నడిచినందుకు, నాకు కొండంత అండగా నిలబడినిందుకు ధన్యవాదాలు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీకంటే ఎక్కువగా నన్ను ఎవ్వరూ నవ్వించలేరు. అయినా ప్రతీసారి నిన్ను చూసి నేను నవ్వలేదు. దయచేసి ఒకటి మరిచిపోకు. భార్య ఎప్పుడూ రైట్. ఐ యామ్ వెరీ సారీ అనే మూడు గోల్డెన్ వర్డ్స్. మనం ఇంకా ఎన్నో యేళ్లు గడపాలి' అంటూ భర్తపై ఉన్న ప్రేమను చాటుకుంది.

  English summary
  Shahid Kapoor Mira Rajput 5th Wedding Anniversary. There’s nobody I’d rather be on this journey called life than you my love. I fall in love with you more every day. And I’m the luckiest girl in the world to have the love of my life be my best friend.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X