ఆ ఏరియాలో వ్యభిచార కార్యకలాపాలు... అందుకే ఇల్లు మారిన హీరో, రూ. 56 కోట్లతో!

By Bojja Kumar

Recommended Video

First look at Shahid Kapoor,Mira Rajput’s gorgeous new house

బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్, మీరా రాజ్‌పుత్ దంపతులు త్వరలో కొత్త ఇంట్లోకి మారబోతున్నాడు. ముంబై వర్లీలోని ఓ బహుళ అంతస్తుల భవనంలో షాహిద్ అత్యంత ఖరీదైన డుప్లెక్స్ ప్లాట్ కొనుగోలు చేశాడు. రూ. 56 కోట్లతో ఈ ఫ్లాట్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇదే భవనంలో అభిషేక్ బచ్చన్, అక్షయ్ కుమార్‌లకు కూడా ప్లాట్స్ ఉన్నాయట. త్వరలోనే షాహిద్ దంపతులు గృహ ప్రవేశం చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.

రూ. 2.91 స్టాంప్ డ్యూటీ

రూ. 2.91 స్టాంప్ డ్యూటీ

ఈ ఫ్లాట్ షాహిద్ పంకజ్ కపూర్, మీరా షాహిద్ కపూర్ పేరు మీద రిజిస్టర్ చేయించినట్లు సమాచారం. రిజిస్ట్రేషన్ కోసం రూ. 2.91 కోట్లు చెల్లించారట. జులై 12, 2018న ఈ రిజిస్ట్రేషన్ జరిగింది.

42, 43 వ అంతస్తులో...

42, 43 వ అంతస్తులో...

షాహిద్ కొనుగోలు చేసిన ఈ డుప్లెక్స్ ఫ్లాట్ 42, 43 అంతస్తులో ఉందట. 42వ అంతస్తులో 427.98 చదరపు మీటర్లు, 43వ అంతస్తులో 300.48 చదరపు మీటర్లు, బాల్కనీ 40.88 చదరపు మీటర్ల వైశాల్యంతో ఉందట.

ఆ ఏరియాలో వ్యభిచార కార్యకలాపాలు...

ఆ ఏరియాలో వ్యభిచార కార్యకలాపాలు...

షాహిద్‌ కపూర్ ప్రస్తుతం జుహు ప్రాంతంలోని తారా రోడ్డులోని ప్రణీత భవనంలో ఉన్నారు. ఆ ప్రాంతంలో ఈ మధ్య కాలంలో వ్యభిచార కార్యకలాపాలు ఎక్కువయ్యాయని, అందుకే వీరు ఇల్లు మారుతున్నట్లు తెలుస్తోంది.

షాహిద్ కపూర్

షాహిద్ కపూర్

సినిమాల విషయానికొస్తే... ప్రస్తుతం షాహిద్ శ్రీ నారాయణ్ సింగ్ దర్శకత్వంలో ‘బట్టి గుల్ మీటర్ చాలు' అనే చిత్రంలో నటిస్తున్నారు. టి సిరీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్, యామీ గౌతమ్ హీరోయిన్లు. సెప్టెంబర్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X