twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తెలుగు సినిమాలు చూడను.. అర్జున్ రెడ్డి చూసి మతిపోయింది!

    |

    గత ఏడాది విడుదలైన అర్జున్ రెడ్డి చిత్రం సంచలన విజయం సాధించింది. దేశవ్యాప్తంగా సినీ అభిమానులు అంతా ఈ చిత్రం గురించి చర్చించుకున్నారంటే ఎంతలా ప్రభావం చూపిందో అర్థం చేసుకోవచ్చు. డెబ్యూ దర్శకుడు సందీప్ వంగా ఈ చిత్రంతో అద్భుతం చేశాడు. సందీప్ వంగా రూపొందించిన బోల్డ్ కథలో విజయ్ దేవరకొండ పెర్ఫామెన్స్ మరో ఎత్తుగా నిలిచింది. ఈ చిత్రం సాధించిన విజయాన్ని దృష్టిలో పెట్టుకుని తమిళ, హిందీ నిర్మాతలు రీమేక్ రైట్స్ కోసం ఎగబడ్డారు. హిందీ అర్జున్ రెడ్డి రీమేక్ లో స్టార్ హీరో షాహిద్ కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అర్జున్ రెడ్డి చిత్రం గురించి తాజగా షాహిద్ కపూర్ మాట్లాడాడు.

    ఉత్కంఠగా ఎదురుచూస్తున్నా

    ఉత్కంఠగా ఎదురుచూస్తున్నా

    అర్జున్ రెడ్డి రీమేక్ లో నటించేందుకు తాను అందరిలాగే ఉత్కంఠగా ఎదురుచూస్తున్నానని షాహిద్ కపూర్ తెలిపాడు. ఈ కొత్త యాంగిల్ లో నటించడానికి చాలా ఆసక్తిగా ఉన్నా. అర్జున్ రెడ్డి చిత్రాన్ని చూసి చాలా బాగా ఎంజాయ్ చేశా అని షాహిద్ కపూర్ తెలిపాడు.

    ఆశ్చర్యపరిచింది

    ఆశ్చర్యపరిచింది

    నేను సాధారణంగానే ఎక్కువగా తెలుగు చిత్రాలు పెద్దగా చూడను. కానీ అర్జున్ రెడ్డి చిత్రం తనని ఆకర్షించిందని షాహిద్ కపూర్ తెలిపాడు. అర్జున్ రెడ్డి కథ చాలా సింపుల్ గా ఉంటుంది. కానీ కథలోని సహజత్వం, రానెస్ తనని ఆశ్చర్యపరిచాయని షాహిద్ కపూర్ తెలిపాడు.

     విజయ్ దేవరకొండ అద్భుతంగా

    విజయ్ దేవరకొండ అద్భుతంగా

    ఈ చిత్రంలో హీరో పాత్ర ఎమోషన్స్ తో కూడుకుని ఉంటుంది. విజయ్ దేవరకొండ అద్భుతంగా నటించాడు. ఒకే అంశం చుట్టూ చక్కగా ఈ చిత్రాన్ని నడిపించారు. హిందీలో కూడా ఈ చిత్రానికి సందీప్ వంగానే దర్శకుడు కావడం విశేషం.

    అక్టోబర్ నుంచే

    అక్టోబర్ నుంచే

    అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ చిత్రం అక్టోబర్ నుంచే సెట్స్ పైకి వెళ్లనుంది. హాట్ బ్యూటీ కైరా అద్వానీ ఈ చిత్రంలో హీరోయిన్. తెలుగులో షాలిని పాండే నటించిన సంగతి తెలిసిందే. ఇద్దరు మెడికల్ స్టూడెంట్స్ మధ్య మొదలయ్యే ప్రేమని ఎమోషనల్ గా నడిపించారు.

    సంతోషంలో షాహిద్ ఫ్యామిలీ

    సంతోషంలో షాహిద్ ఫ్యామిలీ

    ఇటీవలే షాహిద్ కపూర్ సతీమణి మీరా రాజ్ ఫుట్ మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. షాహిద్, మీరా దంపతులకు ఇది రెండవ సంతానం. ఇప్పటికే వీరికి ఓ పాప ఉంది. ఈ సంతోష సమయంలో షాహిద్ కపూర్ అర్జున్ రెడ్డి రీమేక్ చిత్రాన్ని ప్రారంభించబోతున్నాడు.

    English summary
    Shahid Kapoor on Arjun Reddy: The rawness and simplicity of the film surprised me. Arjun Reddy Hindi remake go floors from next month
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X