ప్రభాస్ మనందరి 'మహేంద్ర బాహుబలి'.. అంత పెద్ద స్టార్ నా సినిమా గురించి.. షాహిద్ కపూర్!

Recommended Video

Shahid Kapoor On Prabhas' Review Of Kabir Singh Teaser || Filmibeat Telugu

షాహిద్ కపూర్, కైరా అద్వానీ జంటగా నటిస్తున్న చిత్రం కబీర్ సింగ్. తెలుగులో ఘనవిజయం సాధించిన అర్జున్ రెడ్డికి ఇది రీమేక్ గా తెరకెక్కుతోంది. తెలుగు వర్షన్ ని తెరకెక్కించిన సందీప్ వంగానే ఈ చిత్రానికి కూడా దర్శకుడు. సందీప్ వంగా ఈ చిత్రాన్ని నార్త్ ఆడియన్స్ అభిరుచికి అనుగుణంగా తెరకెక్కిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. తెలుగువర్షన్ కంటే హిందీలో సందీప్ వంగా ఇంకాస్త ఘాటు పెంచినట్లు కనిపిస్తున్నాడు. కబీర్ సింగ్ లో షాహిద్ కపూర్ లుక్ చాలా బావుందంటూ ప్రశంసలు దక్కుతున్నాయి. తాజాగా షాహిద్ కపూర్ మీడియా సమావేశంలో ప్రభాస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

తెలుగు వర్షన్ కంటే

తెలుగు వర్షన్ కంటే

కబీర్ సింగ్ టీజర్ విడుదలైన తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చిత్ర యూనిట్ ని ప్రత్యేకంగా అభినందించాడు. తెలుగు వర్షన్ కంటే కబీర్ సింగ్ బావుందంటూ ప్రశంసించాడు. షాహిద్ కపూర్ తో ప్రత్యేకంగా మాట్లాడాడు కూడా. అంతగా కబీర్ సింగ్ టీజర్ ప్రభాస్ ని ఆకట్టుకుంది. జూన్ లో కబీర్ సింగ్ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు.

మనందరి మహేంద్ర బాహుబలి

మనందరి మహేంద్ర బాహుబలి

కబీర్ సింగ్ టీజర్ పై ప్రభాస్ ప్రశంసలు కురిపించడంపై షాహిద్ కపూర్ తాజాగా స్పందించాడు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రభాస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కబీర్ సింగ్ టీజర్ విడుదలయ్యాక ప్రభాస్ నాతో మాట్లాడాడు. ఆటను చాలా కైండ్ పర్సన్. అంత పెద్ద స్టార్ అయినా కూడా మా చిత్రానికి ప్రోత్సాహం అందించాడు. ప్రభాస్ మనందరికి మహేంద్ర బాహుబలి అంటూ వ్యాఖ్యానించాడు. కబీర్ సింగ్ టీజర్ బాలా బావుందంటూ ప్రభాస్ చెప్పడం మా చిత్రానికి దక్కిన అద్భుతమైన స్పందనగా భావించినట్లు షాహిద్ తెలిపాడు.

ట్రైలర్ మేలో

ట్రైలర్ మేలో

కబీర్ సింగ్ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీనితో ట్రైలర్ విడుదలకు కూడా పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నాం. సినిమా విడుదలకు సరిగా ఐదు వారాల ముందు ట్రైలర్ రిలీజ్ చేస్తాం. మే రెండవ వారంలోట్రైలర్ విడుదలయ్యే అవకాశం ఉందని షాహిద్ కపూర్ తెలిపారు. బాహుబలి, అర్జున్ రెడ్డి లాంటి చిత్రాలు ఐకానిక్ ఫిలిమ్స్ అని షాహిద్ తెలిపాడు. బాహుబలి హిందీలో విడుదలయింది. కానీ అర్జున్ రెడ్డి చిత్రం గురించి హిందీ ఆడియన్స్ ఎక్కువగా తెలిసి ఉండదు. అలాంటి చిత్రం హిందీలో కూడా ఉండాలనే ఉద్దేశంతో తాను చేస్తున్నాని షాహిద్ తెలిపాడు.

సినిమాలో సత్తా ఉంటే

సినిమాలో సత్తా ఉంటే

కబీర్ సింగ్ చిత్రం జూన్ 21న విడుదల కానుంది. అదే రోజు కంగనా రనౌత్, రాజ్ కుమార్ రావు నటిస్తున్న మెంటల్ హై క్యా చిత్రాన్ని కూడా విడుదల చేస్తున్నారు. ఈ రెండు చిత్రాల పోటీ గురించి షాహిద్ కపూర్ మాట్లాడుతూ.. సినిమాలో సత్తా ఉంటే ఎంత పోటీ ఉన్నా తట్టుకుని నిలబడుతుంది. అదే సినిమా బాగలేకుంటే సోలోగా విడుదల చేసినా ప్రయోజనం ఉండదని షాహిద్ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X