షాకింగ్ రూమర్.. షాహిద్ కపూర్‌కు మొదటి దశలో క్యాన్సర్, రహస్యంగా!
బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ గురించి బాలీవుడ్ మీడియాలో సంచలన వార్తలు వెలువడుతున్నాయి. విభిన్నమైన చిత్రాలతో షాహిద్ కపూర్ దూసుకుపోతున్నాడు. షాహిద్ కపూర్ గురించి వెలువడుతున్న రూమర్స్ తో బాలీవుడ్ వర్గాల్లో గందరగోళం నెలకొని ఉంది. తన ఆరోగ్యం గురించి వస్తున్న రూమర్స్ పై షాదీద్ కపూర్, అతడి కుటుంబం క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి వార్తలు సృష్టిస్తే ఊరుకోమని ఘాటుగా హెచ్చరించారు. షాహిద్ గురించి వస్తున్న ఆ రూమర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం!

క్యాన్సర్ మొదటి దశలో
షాహిద్ కపూర్ కు క్యాన్సర్ వ్యాధి సోకినట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో అతడి అభిమానుల్లో, బాలీవడ్ వర్గాల్లో ఆందోళన నెలకొనివుంది. షాహిద్ కపూర్ కు క్యాన్సర్ వ్యాధి మొదటి దశలో ఉందని, అతడి ముంబైలోనే రహస్యంగా చికిత్స చేయించుకుంటున్నాడని ప్రచారం జరుగుతోంది. ఇటీవల చాలా మంది బాలీవుడ్ తారలు క్యాన్సర్ బారీన పడుతున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.

నేను ఆరోగ్యంగానే ఉన్నా
నా ఆరోగ్యం గురించి వస్తున్న వదంతులు నమ్మవద్దు. నేను ఆరోగ్యంగా ఉన్నా. ఎక్కడినుంచో గాలికి వచ్చి పడే వార్తలని పట్టించుకోకండి అంటూ షాహిద్ అభిమానులకు తెలియజేశాడు. షాహిద్ కుటుంబ సభ్యులు కూడా ఈ వార్తలపై ఘాటుగా స్పందించారు. నిరాధారమైన వార్తలు రాస్తే తీవ్రమైన చర్యలు ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించారు. అయినా మీడియాలో ఏది పడితే అది ఎలా రాస్తారని ప్రశ్నించారు.

ఇప్పటికే షాక్‌లో బాలీవుడ్
సోనాలి బింద్రే, ఇర్ఫాన్ ఖాన్ లాంటి సెలెబ్రిటీలు ఈ ఏడాదే క్యాన్సర్ బారీన పడ్డారు. బడా సెలెబ్రెటీలకు క్యాన్సర్ సోకడంతో ఇప్పటికే బాలీవుడ్ షాక్ లో ఉంది. ఇపుడు ఇలాంటి ఫేక్ వార్తలతో మరింత గందరగోళం నెలకొంటోంది. ఇటీవల రిషి కపూర్ కూడా క్యాన్సర్ బారీన పడ్డట్లు రూమర్స్ సృష్టించారు. ఆ వార్తలపై రిషి సోదరుడు రణధీర్ మండిపడిన సంగతి తెలిసిందే.

అర్జున్ రెడ్డి రీమేక్‌తో బిజీ
షాహిద్ కపూర్ ప్రస్తుతం తెలుగు సూపర్ హిట్ చిత్రం అర్జున్ రీమేక్ లో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని హిందీలో కబీర్ సింగ్ పేరుతో రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఒరిజినల్ వర్షన్ దర్శకుడు సందీప్ వంగానే హిందీ వర్షన్ కు కూడా దర్శత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్ గా కైరా అద్వానీ నటిస్తోంది. మద్యం, డ్రగ్స్ కు బానిసగా మారే యువ వైద్యుడి పాత్రలో షాహిద్ నటించబోతున్నాడు. ఎమోషనల్ ప్రేమ కథగా వచ్చిన అర్జున్ రెడ్డి తెలుగులో సంచలన విజయం సాధించింది.


Click it and Unblock the Notifications











