Jersey Postponed: బాలీవుడ్ మూవీపై కేజీఎఫ్ ఎఫెక్ట్.. మరోసారి వాయిదా పడ్డ జెర్సీ

గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో తెలుగు సినిమా స్టామినా భారీ స్థాయిలో పెరిగిన విషయం తెలిసిందే. అందుకే మన సినిమాలను తమ తమ భాషల్లోకి రీమేక్ చేసుకోవాలని చాలా పరిశ్రమలకు చెందిన దర్శక నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికితోడు మన సినిమాలు అక్కడ భారీ స్పందన వస్తుండడంతో హిందీ వాళ్లు తెలుగు సినిమాల హక్కుల కోసం పోటీ పడుతున్నారు. ఫలితంగా బాలీవుడ్‌లో టాలీవుడ్ సినిమాలకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికే పలు చిత్రాలు హిందీలోకి రీమేక్ అయ్యాయి. అలా చాలా రోజుల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైన చిత్రమే 'జెర్సీ'.

వరుసగా ఫ్లాపులతో బాధ పడుతున్న సమయంలో నేచురల్ స్టార్ నానిని మరోసారి హిట్ ట్రాక్ ఎక్కించిన చిత్రమే 'జెర్సీ'. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో క్రికెట్ నేపథ్యంతో తెరకెక్కిన ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు భారీ స్థాయిలో కలెక్షన్లు రాబట్టింది. యూనివర్శల్ సబ్జెక్ట్ కావడంతో ఈ చిత్రాన్ని తమ తమ భాషల్లోకి రీమేక్ చేసుకోడానికి అన్ని ఇండస్ట్రీలకు చెందిన ఫిల్మ్ మేకర్లు హైదరాబాద్ క్యూ కట్టిన విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సూపర్ హిట్ సినిమా హక్కులను సొంతం చేసుకుని తెలుగు బడా ప్రొడ్యూసర్లు దిల్ రాజు, అల్లు అరవింద్ హిందీలోకి రీమేక్ చేస్తున్నారు.

Shahid Kapoors Jersey Movie Postponed to April 22nd

షాహీద్ కపూర్ హీరోగా రూపొందిన 'జెర్సీ' మూవీ షూటింగ్ చాలా కాలం క్రితమే మొదలైంది. అయితే, మధ్యలో కొన్ని అనుకోని అవాంతరాలు ఎదురు కావడంతో ఈ సినిమా షూట్ సవ్యంగా సాగలేదు. దీంతో అనుకున్న సమయానికి పూర్తి కాలేదు. దీంతో ఇది సినిమా రిలీజ్‌పైన తీవ్ర స్థాయిలో ప్రభావాన్ని చూపించింది. ఫలితంగా ఈ మూవీ ఇప్పటికే పలుమార్లు వాయిదా కూడా పడింది. ఇలాంటి పరిస్థితుల్లో 'జెర్సీ' మూవీని ఏప్రిల్ 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అందుకు అనుగుణంగానే ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ఇప్పటికే ముమ్మరం చేసేసింది.

మరో మూడు రోజుల్లో 'జెర్సీ' విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ఇది వాయిదా పడినట్లు తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. తాజా సమాచారం ప్రకారం.. షాహీద్ కపూర్ నటించిన ఈ సినిమాను ఏప్రిల్ 22వ తేదీకి వాయిదా వేస్తున్నారట. దీనికి కారణం ఏప్రిల్ 14వ తేదీన యశ్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందిన 'కేజీఎఫ్ చాప్టర్ 2' విడుదల కాబోతుండడమే అని తెలుస్తోంది. ఈ సినిమా బాలీవుడ్ మార్కెట్‌పైన కూడా తీవ్ర స్థాయిలో ప్రభావాన్ని చూపిస్తోంది. ఇది హిందీలో దాదాపు 4000 వేల థియేటర్లలో విడుదల కాబోతుంది. దీంతో 'జెర్సీ'కి ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు. అందుకే దీన్ని వాయిదా వేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.

షాహీద్ కపూర్ హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'జెర్సీ' మూవీని గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించాడు. అల్లు ఎంటర్‌టైన్‌మెంట్స్, దిల్ రాజు ప్రొడక్షన్స్, సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, బ్రాట్ ఫిల్మ్స్ బ్యానర్లపై దీన్ని అల్లు అరవింద్, దిల్ రాజు, సూర్య దేవర నాగ వంశీ, అమన్ గిల్ సంయుక్తంగా నిర్మించారు. దీనికి అనిరుథ్ రవిచందర్ సంగీతం అందించగా.. సచేత్ పరంపర సాంగ్స్ కంపోజ్ చేశారు. మృనాల్ ఠాకూర్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X