అర్జున్ రెడ్డి రీమేక్: గడ్డం తీసేసిన షాహిద్, సీన్ టు సీన్ హిందీలో...
'అర్జున్ రెడ్డి' చిత్రానికి రీమేక్‌గా హిందీలో 'కబీర్ సింగ్' తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సందీప్ కుమార్ వంగ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఇటీవల షాహిద్ కపూర్ భారీ గడ్డంతో ఉన్న ఫోటోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. సినిమాలో గడ్డంతో ఉండే సన్నివేశాలు మొదటగా షూట్ చేసినట్లు తెలుస్తోంది.
హీరో హీరోయిన్ విడిపోయిన తర్వాత వచ్చే సీన్లు పూర్తవ్వడంతో.... షాహిద్ కపూర్ గడ్డం తీసేసిన లుక్ విడుదల చేశారు. అర్జున్ రెడ్డి సినిమా ప్రకారం చూస్తే... ఇప్పటి నుంచి కాలేజీలో వచ్చే సీన్లు, గడ్డం లేని సన్నివేశాలు చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రంలో షాహిద్ కపూర్ సరసన కియారా అద్వానీ నటిస్తోంది. తెలుగు సినిమాకు భిన్నంగా బాలీవుడ్ నేటివిటీకి తగిన విధంగా 'కబీర్ సింగ్'లో మార్పులు చేసి తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు. అయితే మూల కథ, మిగతా మూవీ మొత్తం సీన్ టు సీన్ తెలుగులో తీసినట్లే తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

ఈ సినిమా తర్వాత షాహిద్ కపూర్ నటించబోయే మరో సినిమా కూడా ఖరారైంది. డింకో సింగ్ అనే ఇండియన్ బాక్సర్ బయోపిక్‌లో షాహిద్ నటించబోతున్నారు. అయితే ఈ ప్రాజెక్టు అనౌన్స్ చేయగానే కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ షాహిద్ అవేమీ పట్టించుకోలేదు. గతంలో ప్రియాంక చోప్రా మేరీ కోమ్ బయోపిక్ చేసే సమయంలో కూడా ఇలాంటి విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











