నెట్ ఫ్లిక్స్ తో షాహిద్ కపూర్ డీల్
కరోనా పుణ్యమా ఓటీటీ ప్లాట్ ఫామ్స్‌కు ప్రేక్షకాదరణ భారీగా పెరిగిపోయింది. దాంతో సినిమాలను విడుదల చేయకుండా అలా వదిలేయడం కంటే ఓటీటీ ప్లాట్ ఫామ్స్‌లో నేరుగా విడుదల చేయడం బెటర్ అనుకుంటున్నారు పలువురు నిర్మాతలు. థియేటర్ యాజమాన్యాలు అభ్యంతరాలు చెబుతున్నా.. పలువురు నిర్మాతలు ముఖ్యంగా చిన్న నిర్మాతలు అమేజాన్, నెట్ ఫ్లిక్స్, జీ-5, సన్ నెక్స్ట్, ఆహా, హాట్ స్టార్ వంటి ఓటీటీ ప్లాట్ పామ్స్‌లో సినిమాల విడుదలకు రంగం సిద్దం చేసుకుంటున్నారు.
ఇప్పట్లో థియేటర్స్ ఓపెన్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. దాంతో చాలామంది స్టార్స్ డిజిటల్ వరల్డ్ లోకి అడుగు పెడుతున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ కూడా అదే బాటలో నడవాలనుకుంటున్నాడట. ఇందుకోసం ఈ హీరో ఏకంగా 100 కోట్ల ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడట .

డిజిటల్ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ లో పలు పాజెక్టులు చేసేందుకు 100 కోట్ల డీల్ కు షాహిద్ సైన్ చేసాడట. సినిమాలు, వెబ్ సీరీస్ లతో నెట్ ఫ్లిక్స్ ను షేక్ చేయబోతున్నాడు షాహిద్. మరో వైపు హృతిక్ రోషన్ , అజయ్ దేవగన్ కూడా హాట్ స్టార్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు . అయితే వీరిలో హృతిక్ ఒక్క షోకే 80 కోట్లు తీసుకుంటున్నాడని సమాచారం.


Click it and Unblock the Notifications











