బాలీవుడ్ జెర్సీలో ఇండియన్ క్రికెటర్స్.. కబీర్ సింగ్ లక్కు మామూలుగా లేదు!
టాలీవుడ్ సినిమాలపై బాలీవుడ్ హీరోలు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వరుస ఫెయిల్యూర్స్ తో సతమతమవుతున్న తరుణంలో టాలీవుడ్ హిట్టు కథలే మంచి బూస్ట్ ఇస్తున్నాయని ఇప్పటికే కొన్ని సినిమాలు నిరూపించాయి. ముఖ్యంగా సల్మాన్ ఖాన్ పోకిరి, కిక్ సినిమాలను రీమేక్ చేసి కెరీర్ ట్రాక్ ని సెట్ చేసుకున్నాడనే చెప్పాలి. అజయ్ దేవ్ గన్, అక్షయ్ కుమార్ కూడా తెలుగు కథలతో మంచి విజయాలు అందుకున్నారు.
ఇక ఇప్పుడు షాహిద్ కపూర్ కూడా అదే బాటలో నడుస్తూ కెరీర్ ని మరో స్థాయికి తీసుకెళుతున్నాడు. అర్జున్ రెడ్డి సినిమాను కబీర్ సింగ్ గా రీమేక్ చేసిన షాహిద్ కెరీర్ లోనే బిగెస్ట్ హిట్ అందుకున్నాడు. ఇక ఆ తరువాత నాని జెర్సీ సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే అందులో కొంతమంది రియల్ క్రికెటర్లు ఆడనున్నారట. నాని జెర్సీలో కూడా ఉన్నారు కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడినవారు లేరు.

అయితే షాహిద్ కపూర్ నటిస్తున్న హిందీ జెర్సీలో మాత్రం జనాలకు తెలిసిన ఇద్దరు ఇండియన్ క్రికెటర్లు కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. నార్త్ ఆడియెన్స్ అభిరుచికి తగ్గట్టుగా దర్శకుడు గౌతమ్ కథలో కొన్ని మార్పులు చేసినట్లు సమాచారం. సినిమా తప్పకుండా బాక్సాఫీస్ హిట్ గా నిలుస్తుందని చిత్ర యూనిట్ నమ్మకంతో ఉందట. రియల్ క్రికెటర్లు కూడా సినిమాలో భాగం కావడంతో షాహిద్ లక్కు మాములుగా లేదని బాలీవుడ్ మీడియాలో టాక్ వస్తోంది. మరి ఈ సినిమాతో షాహిద్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











