సెక్స్ టెక్ట్సింగ్, ఫేవరెట్ బెడ్ పొజిషన్: పడకగది రహస్యాలు విప్పిన షాహిద్-మీరా
ఇండియాలో సినిమా స్టార్లకు ఫాలోయింగ్, ఆదరణ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినీ అభిమానులు తాము ఇష్టపడే యాక్టర్ల సినిమాలు చూడటానికి మాత్రమే పరిమితం కాకుండా, వారి వ్యక్తిగత విషయాలు తెలుసుకోవడానికి కూడా ఆసక్తి చూపుతుంటారు.
అయితే చాలా మంది యాక్టర్లు తమ పర్సనల్ విషయాలను బయటకు చెప్పడానికి ఇష్టపడరు. అయితే కొందరు మాత్రం తమ పడకగది మ్యాటర్లు కూడా అభిమానులతో పంచుకుంటారు. ఇలాంటి వారిలో బాలీవుడ్ కపుల్ షాహిద్ కపూర్, మీరా రాజ్‌పుత్ ముందుంటారు. తాజాగా నేహా ధూపియా ఛాట్ షోలో షాహిద్-మీరా పాల్గొన్న సందర్భంగా వారి నుంచి ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

ఇద్దరూ సెక్స్ టెక్టింగ్ చేసుకుంటారా?
ఇద్దరూ sexting(సెక్స్ టెక్ట్సింగ్) చేసుకుంటారా? అని నేహా ధూపియా ప్రశ్నించగా... ‘అవును, మా ఇద్దరి మధ్య అలాంటివి జరుగుతాయి. అందరు కపుల్ మాదిరిగానే మా మధ్య కూడా అలాంటి సరదాలు ఉంటాయి.' అంటూ షాహిద్ కపూర్ నిర్మొహమాటంగా సమాధానం ఇచ్చారు.

ఇద్దరిలో ఎవరు బెటర్?
sexting అంటే ఇద్దరూ ఒకరికొరరు శృంగార ప్రరేపితమై సందేశాలు, ఫోటోలు ఫోన్ లేదా కంప్యూటర్ ద్వారా పంచుకోవడం. ఈ విషయంలో ఎవరు బెటర్? అంటే... ఇద్దరూ సమాన స్థాయిలో ఉంటామని షాహిద్ కపూర్ వెల్లడించారు. తాము భార్య భర్తలం కాబట్టి మరీ అంత ఎక్కువగా sexting చేసుకునే అవసరం ఉండదు, ఏదైనా నేరుగానే జరుగుతుంది అంటూ సమాధానం ఇచ్చారు.

బెడ్‌పై మీకు ఇష్టమైన భంగిమ ఏది?
ఈ షోలో భాగంగా నిర్వహించిన ‘స్కారీ స్పైస్' రౌండ్లో నేహా ధూపియా.... మీరాను బెడ్‌పై నీ ఫేవరెట్ పొజిషన్ ఏమిటి? అని పశ్నించింది. ఈ ప్రశ్నను మీరా స్కిప్ చేస్తుందని షాహిద్ భావించాడు. అయితే ఆమె ఏ మాత్రం ఆలోచించకుండా ‘ఆ సమయంలో అంతా కూడా మా ఆయన కంట్రోల్‌లో ఉంటుంది, నేను ఏం చేయాలనేది ఆయనే చెబుతంటాడు' అంటూ సమాధానం ఇచ్చింది.

భార్య బెడ్రూం సీక్రెట్ చెప్పిన షాహిద్
ఈ సందర్భంగా సాహిద్ కపూర్ తన భార్యకు సంబంధించిన బెడ్రూం సీక్రెట్ వెల్లడించారు. మీరా రాత్రి పడుకునే సమయంలో నా బట్టలు వేసుకుని పడుకుంటుందని తెలిపారు. ఎలాంటి మొహమాటం లేకుండా షాహిద్, మీరా తమ బెడ్రూం సీక్రెట్లు చెప్పడంతో అంతా ఆశ్చర్య పోయారు.

తల్లిదండ్రులుగా హ్యాపీ
దంపతులుగా, ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులుగా షాహిద్ కపూర్, మీరా రాజ్ పుత్ హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. వీరికి రెండేళ్ల కూతురు మిషాతో పాటు 9 నెలల వయసున్న కుమారుడు జేన్ ఉన్న సంగతి తెలిసిందే. సినిమాల విషయానికొస్తే... ప్రస్తుతం షాహిద్ కపూర్ ‘కబీర్ సింగ్' చిత్రంలో నటిస్తున్నారు. తెలుగు మూవీ ‘అర్జున్ రెడ్డి'కి ఇది రీమేక్.


Click it and Unblock the Notifications











