twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర.. ఫోన్ నంబర్ కోసం ప్రయత్నించి, విచారణలో సంచలనం!

    |

    కండల వీరుడు సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర జరిగిందా.. ఇప్పుడు ఇవే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇటీవల సల్మాన్ ఖాన్ ని హత్య చేస్తానంటూ బెదిరింపు కాల్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ వ్యక్తిని ఉత్తరప్రదేశ్ పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. సల్మాన్ ఖాన్ కు దేశ వ్యాప్తంగా కోట్లల్లో అభిమానులు ఉన్నారు. ఇప్పటికే సల్మాన్ ఖాన్ పలు కేసులతో సతమతమవుతుంటే.. ఇలాంటి బెదిరింపు కాల్స్ ఇబ్బందికి గురి చేస్తున్నారు. దీనితో సల్మాన్ ఖాన్ స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

    పాకిస్థాన్ జెండా ఎగిరేసిన సల్మాన్ ఖాన్.. కండల వీరుడిపై కేసు..పాకిస్థాన్ జెండా ఎగిరేసిన సల్మాన్ ఖాన్.. కండల వీరుడిపై కేసు..

     నిందితుడి అరెస్ట్

    నిందితుడి అరెస్ట్

    సల్మాన్ ఫిర్యాదు మేరకు విచారణ జరిగిపిన పోలీసులు బెదిరింపు కాల్ కు పాల్పడిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడు ఉత్తర ప్రదేశ్ కు చెందిన షారుఖ్ గులాంనబీగా పోలీసులు గుర్తించారు. లోతుగా విచారణ జరిపిన పోలీసులకు అనుమానాలు పెంచే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

    సల్మాన్ అభిమానిని

    సల్మాన్ అభిమానిని

    తాను సల్మాన్ ఖాన్ అభిమానిని అని గులాం నబి పోలీసులతో చెబుతున్నాడట. తాను సల్మాన్ ఖాన్ ని గాడ్ ఫాదర్ గా భావిస్తాను. అందుకే ఆయనతో మాట్లాడాలి అని అనుకున్నా. దీనితో సల్మాన్ ఖాన్ మేనేజర్ నంబర్ తెలుసుకుని అతడికి ఫోన్ చేశా. సల్మాన్ ఖాన్ నంబర్ కావాలని అడిగా. కుదరదని చెప్పాడు. దీనితో సల్మాన్ ఖాన్ తండ్రి సలీమ్ ఖాన్ కు ఫోన్ చేశా. ఆయనకూడా నంబర్ ఇచ్చేందుకు అంగీకరించలేదు. అందువలనే బెదిరింపులకు పాల్పడ్డానని పోలీసులతో చెప్పుకొచ్చాడట.

    సంచలన విషయాలు

    సంచలన విషయాలు

    అతడి గురించి ఇంకాస్త లోతుగా విచారణ జరిపిన పోలీసులకు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అండర్ వరల్డ్ డాన్ చోటా షకీల్ వద్ద గులాం నబి పనిచేస్తున్నట్లు పోలీసులు కనుగొన్నారు. దావూద్ ఇబ్రహీం కు చోట షకీల్ చాలా సన్నిహితుడు. దీనితో సల్మాన్ ఖాన్ హత్యకు భారీ కుట్ర జరిగినట్లు అనుమానాలు తలెత్తుతున్నాయి.

    ఫోన్ నంబర్ ఎలా వచ్చింది

    ఫోన్ నంబర్ ఎలా వచ్చింది

    సల్మాన్ ఖాన్ మేనేజర్ ఫోన్ నంబర్ నీకు ఎలా వచ్చింది అనే ప్రశ్నకు అతడు నమ్మశక్యం కానీ సమాధానం ఇచ్చాడు. ఓ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ద్వారా తెలుసుకున్నానని చెబుతున్నాడు. కానీ పోలీసులు మాత్రం ఇతడికి సహకరించే వారు ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి ఫోన్ నంబర్ ఆధారంగా పోలీసులు అతడిని ట్రాక్ చేసి అదుపులోకి తీసుకున్నారు.

    English summary
    'Shahrukh' Arrested in UP for Threatening Salman Khan's Father. Recently, a man from Prayagraj, Uttar Pradesh, was detained for allegedly threatening Salman’s PA and his father Salim Khan.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X