నేను కష్టపడుతున్న రోజుల్లో వాళ్లే నాకు అన్నం పెట్టారు: షారుక్ ఖాన్
బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ హోస్ట్ చేస్తున్న 'దస్ కా దమ్' గ్రాండ్ ఫినాలెకు షారుక్ ఖాన్, రాణీ ముఖర్జీ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ వారాంతం ప్రసారం అయ్యే ఈ షోకు సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఇందులో షారుక్‌ను తోపుడుబండిపై కూర్చొబెట్టి సల్మాన్ తోసుకుంటూ రావడం అందరినీ ఆశ్చర్య పరిచింది. దీంతో పాటు రాణి ముఖర్జీపై సల్మాన్ సంధించిన కొన్ని ప్రశ్నలు షోలో నవ్వులు పూయించగా... దానికి షారుక్ ఖాన్ సైడ్ కామెంట్స్ అందరూ కడుపుబ్బా నవ్వేలా చేస్తాయని స్పష్టం అవుతోంది. ఈ సందర్భంగా షారుక్ ఖాన్ సల్మాన్ గురించి, ఆయన ఫ్యామిలీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సల్మాన్ కుటుంబం నాకు అన్నం పెట్టింది
ముంబైకి వచ్చి యాక్టర్‌గా యాక్టర్‌గా స్ట్రగుల్ అవుతున్న రోజుల్లో సల్మాన్ ఖాన్ కుటుంబం నాకు అన్నం పెట్టింది. సల్మాన్ ఫాదర్ సలీమ్ జీ నాకు ఎంతో సపోర్ట్ చేశారు. నేను ఇపుడు ఈ స్థాయికి వచ్చానంటే దానికి కారణం వారి కుటుంబమే... అని షారుక్ అన్నారు.

కేవలం సల్మాన్ కోసమే వచ్చాను
ఈ ‘దస్ కా దమ్' కార్యక్రమానికి నేను రావడానికి కారణం కేవలం సల్మాన్ ఖాన్ మాత్రమే. ఇక్కడికే కాదు... ఆయన ఎక్కడికి రమ్మన్నా నేను ఎలాంటి అభ్యంతరం లేకుండా వస్తాను అని ఈ సందర్భంగా షారుక్ తేల్చి చెప్పారు.
ఆయనతో చాలా ఎంజాయ్ చేశాను
సల్మాన్ ఖాన్ ఎక్కడ ఉన్నా అక్కడ సందడిగా ఉంటుంది. ఆయనతో పని చేసేవారిని చాలా ఎంటర్టెన్ చేస్తారు. ఆయనతో కలిసి పని చేసినపుడు చాలా ఎంజాయ్ చేశాను. ఇపుడు సల్మాన్ హోస్ట్ చేస్తున్న షోకు రావడం ఆనందంగా ఉంది అని షారుక్ అన్నారు.

విడిపోయి మళ్లీ కలిసి..
కెరీర్ మొదటి నుండి బెస్ట్ ఫ్రెండ్స్‌గా ఉన్న షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్.... మధ్యలో ఓ చిన్న గొడవ కారణంగా విడిపోయారు. అయితే 2014లో వీరు మళ్లీ కలిసిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ ఇండస్ట్రీని ఏలుతున్న ఈ ఇద్దరు స్టార్... ఒకరి సినిమాలో మరొకరు గెస్ట్ రోల్స్ కూడా చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











