For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  నేను కష్టపడుతున్న రోజుల్లో వాళ్లే నాకు అన్నం పెట్టారు: షారుక్ ఖాన్

  By Bojja Kumar
  |

  బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ హోస్ట్ చేస్తున్న 'దస్ కా దమ్' గ్రాండ్ ఫినాలెకు షారుక్ ఖాన్, రాణీ ముఖర్జీ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ వారాంతం ప్రసారం అయ్యే ఈ షోకు సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఇందులో షారుక్‌ను తోపుడుబండిపై కూర్చొబెట్టి సల్మాన్ తోసుకుంటూ రావడం అందరినీ ఆశ్చర్య పరిచింది. దీంతో పాటు రాణి ముఖర్జీపై సల్మాన్ సంధించిన కొన్ని ప్రశ్నలు షోలో నవ్వులు పూయించగా... దానికి షారుక్ ఖాన్ సైడ్ కామెంట్స్ అందరూ కడుపుబ్బా నవ్వేలా చేస్తాయని స్పష్టం అవుతోంది. ఈ సందర్భంగా షారుక్ ఖాన్ సల్మాన్ గురించి, ఆయన ఫ్యామిలీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

  సల్మాన్ కుటుంబం నాకు అన్నం పెట్టింది

  సల్మాన్ కుటుంబం నాకు అన్నం పెట్టింది

  ముంబైకి వచ్చి యాక్టర్‌గా యాక్టర్‌గా స్ట్రగుల్ అవుతున్న రోజుల్లో సల్మాన్ ఖాన్ కుటుంబం నాకు అన్నం పెట్టింది. సల్మాన్ ఫాదర్ సలీమ్ జీ నాకు ఎంతో సపోర్ట్ చేశారు. నేను ఇపుడు ఈ స్థాయికి వచ్చానంటే దానికి కారణం వారి కుటుంబమే... అని షారుక్ అన్నారు.

   కేవలం సల్మాన్ కోసమే వచ్చాను

  కేవలం సల్మాన్ కోసమే వచ్చాను

  ఈ ‘దస్ కా దమ్' కార్యక్రమానికి నేను రావడానికి కారణం కేవలం సల్మాన్ ఖాన్ మాత్రమే. ఇక్కడికే కాదు... ఆయన ఎక్కడికి రమ్మన్నా నేను ఎలాంటి అభ్యంతరం లేకుండా వస్తాను అని ఈ సందర్భంగా షారుక్ తేల్చి చెప్పారు.

  ఆయనతో చాలా ఎంజాయ్ చేశాను

  సల్మాన్ ఖాన్ ఎక్కడ ఉన్నా అక్కడ సందడిగా ఉంటుంది. ఆయనతో పని చేసేవారిని చాలా ఎంటర్టెన్ చేస్తారు. ఆయనతో కలిసి పని చేసినపుడు చాలా ఎంజాయ్ చేశాను. ఇపుడు సల్మాన్ హోస్ట్ చేస్తున్న షోకు రావడం ఆనందంగా ఉంది అని షారుక్ అన్నారు.

  విడిపోయి మళ్లీ కలిసి..

  విడిపోయి మళ్లీ కలిసి..

  కెరీర్ మొదటి నుండి బెస్ట్ ఫ్రెండ్స్‌గా ఉన్న షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్.... మధ్యలో ఓ చిన్న గొడవ కారణంగా విడిపోయారు. అయితే 2014లో వీరు మళ్లీ కలిసిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ ఇండస్ట్రీని ఏలుతున్న ఈ ఇద్దరు స్టార్... ఒకరి సినిమాలో మరొకరు గెస్ట్ రోల్స్ కూడా చేస్తున్నారు.

  English summary
  "The first time I came to Mumbai as a struggling actor, I had my meals at Salman Khan's place where Salim Khan Ji supported me a lot. It is because of them I have become 'Shah Rukh Khan'. I have come on the show (Dus Ka Dum) only because of Salman Khan and I will go wherever he tells me to go. I really thank Sony TV to have me on the show as we get very less time to spend with each other due to our hectic schedule," said Shah Rukh Khan.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more