షారుఖ్ ఖాన్, కత్రినా లకు కరోనా పాజిటివ్.. ఆ పార్టీకి వెళ్ళిన వారందరిలో టెన్షన్!

షారుఖ్ ఖాన్, కత్రినా కైఫ్ లకు కోవిడ్ సోకింది. విశేషమేమిటంటే.. కొన్ని రోజుల క్రితం కరణ్ జోహార్ 50వ పుట్టినరోజు వేడుకలకు షారుక్, కత్రినా కైఫ్ వెళ్లారు. ఆ తర్వాత ఇద్దరు స్టార్‌లకు కరోనా పాజిటివ్‌గా వార్తలు వచ్చాయి. కరణ్ జోహార్ పార్టీకి వెళ్లిన కొద్ది రోజులకే కార్తీక్ ఆర్యన్ అలాగే ఆదిత్య రాయ్ కపూర్ కూడా కరోనా బారిన పడ్డారు. నటుడు కార్తీక్ ఆర్యన్‌ కరణ్ జోహార్ పుట్టినరోజు వేడుకకు హాజరు కాలేదు. భూల్ భూలయ్యా ప్రమోషన్స్ లో ఆయనతో కలిసి పాల్గొన్న కీయరా మాత్రం పార్టీకి హాజరైంది. ఇక కరోనా పాజిటివ్‌గా గుర్తించబడినందున IIFA 2022లో అతని ప్రదర్శన కూడా మిస్ అయింది. శనివారం, నటుడు ఆదిత్య రాయ్ కపూర్ కూడా కరోనా పాజిటివ్ అని నివేదించబడింది.

ఆ తర్వాత ఇప్పుడు కత్రీనా, కింగ్‌ఖాన్‌లకు కరోనా సోకడం అభిమానులకు చాలా షాకింగ్‌గా మారింది. బాలీవుడ్ హంగామా నివేదిక ప్రకారం, కరణ్ జోహార్ ఇచ్చిన తన 50వ బర్త్ డే గ్రాండ్ పార్టీకి అతిథులుగా వచ్చిన 50 నుండి 55 మందికి కరోనా ఇన్ఫెక్షన్ సోకింది. కరణ్ జోహార్ పార్టీ మే 25న యష్‌రాజ్ స్టూడియోలో జరిగింది. అయితే ఇప్పుడు ఈ పార్టీకి హాజరైన షారుక్ ఖాన్, కత్రినా కైఫ్, కార్తీక్ ఆర్యన్ మరియు ఆదిత్య రాయ్ కపూర్‌లకు కరోనా సోకినట్టు అధికారికంగా ప్రకటించారు. షారూఖ్ ఖాన్ పార్టీలో రెడ్ కార్పెట్ మీద అతను కనిపించలేదు, కానీ పార్టీ డ్యాన్స్ ఫ్లోర్‌లో వీడియో వైరల్ అయ్యింది. ఇందులో షారుఖ్ ఖాన్ 'కోయి మిల్ గయా' పాటకు డ్యాన్స్ చేస్తూ కనిపించారు.

Shahrukh Khan and Katrina Kaif tested corona poisitve.

షారుఖ్ ఖాన్ గురించి ఆయన అధికారికంగా ప్రకటించ లేదు. ఆయన బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆయనకు కరోనా సోకినట్టు అధికారికంగా ప్రకటించారు. ''మా బ్రాండ్ అంబాసిడర్ షారుఖ్ ఖాన్‌కు కోవిడ్ పాజిటివ్ అని గుర్తించినట్లు ఇప్పుడే తెలిసింది. సూపర్ స్టార్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించండి. బాగుండండి షారుక్! త్వరగా తిరిగి రండి!'' అంటూ ఆమె పేర్కొంది. ఇక కత్రినా గురించి బాలీవుడ్ వెబ్ సైట్స్ లో వార్తలు వస్తున్నాయి కానీ ఆమె అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇక ఈ క్రమంలో రాబోయే రోజుల్లో చాలా మంది సెలబ్రిటీలు కరోనా పాజిటివ్ అనే వార్తలు బయటకు వచ్చే అవకాశం ఉంది. గతేడాది కూడా కరణ్ జోహార్ ఇలాంటి పార్టీనే పెట్టుకున్నారు. ఇందులో చాలా మంది తారలకు కరోనా సోకింది. ఇప్పుడు కూడా కరణ్ జోహార్ పార్టీలో మరోసారి, కరోనా పుట్ట పేలడం సోషల్ మీడియాలో భయాందోళనలను సృష్టించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X