అర్ధరాత్రి షారుక్ ఇంటి ముందు బారులు తీరిన ఫ్యాన్స్... మరీ ఈ స్థాయిలోనా?
Recommended Video

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్... ఇండియాలోని టాప్ హీరోల్లో ఒకరు. దేశ వ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. సోషల్ మీడియాలో కోట్లాది మంది ఫాలోవర్స్ ఆయన సొంతం. షారుక్ సినిమా వస్తుందంటే ఒక పండగ వాతావరణం ఉంటుంది. మరి అలాంటి హీరో పుట్టినరోజున హడావుడి ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
నేడు షారుక్ 53వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. తమ అభిమాన స్టార్ పుట్టినరోజును సందర్భంగా ఆయన్ను విష్ చేసేందుకు వందలాది మంది అభిమానులు నిన్న అర్దరాత్రి దాటిన తర్వాత ముంబైలోని షారుక్ నివాసం మన్నత్ వద్దకు చేరుకున్నారు.
కుటుంబ సభ్యులు, అభిమానుల మధ్య షారుక్ పుట్టినరోజు వేడుక
కుటుంబ సభ్యులు, అభిమానుల మధ్య షారుక్ ఖాన్ తన పుట్టినరోజు వేడుక జరుపుకున్నారు. ఈ సందర్భంగా భార్యకు కేక్ తినిపిస్తున్న ఫోటోను ఆయన పోస్టు చేశారు. తనపై ప్రేమ చూపిస్తున్న అభిమానులను తన కుటుంబ సభ్యులుగా పేర్కొంటూ ఆనందం వ్యక్తం చేశారు.
అభిమానులను పలకరించిన షారుక్
తనను విష్ చేసేందుకు వచ్చిన అభిమానులను పలకరించేందుకు బయటకు వచ్చిన షారుక్ ఈ సందర్భంగా వారు తన పట్ల చూపిస్తున్న ప్రేమను చూసి భావోద్వేగానికి గురయ్యారు. ఫ్లయింగ్ కిసెస్ ఇస్తూ వారిని ఉత్తేజ పరిచారు.
మీకు రుణపడి ఉంటాను
తన కోసం భారీగా వచ్చిన అభిమానులను ఏ మాత్రం నిరాశ పరచకుండా బయటకు వచ్చి వారి శుభాకాంక్షలను స్వీకరించారు షారుక్. ఫ్యాన్స్ తన కోసం ఇక్కడి వరకు వచ్చి విష్ చేయడాన్ని ఎప్పటికీ మరిచి పోలేనని, మీకు ఎప్పటికీ రుణపడి ఉంటానని వ్యాఖ్యానించారు.

నేడు జీరో ట్రైలర్
పుట్టినరోజు సందర్భంగా షారుక్ నటించిన ‘జీరో' మూవీ ట్రైలర్ ఈ రోజు విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ముంబైలోని ఐమాక్స్ వడాలాలో ఇందుకు సంబంధించి భారీ ఈవెంట్ శుక్రవారం మధ్యాహ్నం జరుగనుంది.

షారుక్ ఖాన్
షారుక్ ఖాన్ నవంబర్ 2, 1965లో ఢిల్లీలో జన్మించారు. 1980ల్లో టీవి సీరియల్స్ ద్వారా కెరీర్ ప్రారంభించి....1992లో ‘దీవానా' సినిమాతో బాలీవుడ్ తెరంగేట్రం చేశారు. తర్వాత వరుస విజయాలతో బాలీవుడ్లో టాప్ పొజిషన్‌కు చేరుకున్నారు.


Click it and Unblock the Notifications











