షారుక్ కూతురిని కూడా వదలడం లేదు.. 12 ఏళ్ళ వయసు నుంచే..

బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్స్ కి ఏ స్థాయిలో క్రేజ్ ఉంటుందో అదే తరహాలో వారి పిల్లలకు కూడా మంచి ఫాలోయింగ్ ఉంటుంది. సోషల్ మీడియాలో వారసుల ఫొటోలు బాగానే వైరల్ అవుతుంటాయి. ఇక బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ కూతురు సుహానా ఖాన్ కి కూడా మంచి క్రేజ్ ఉంది. ఆమెకు ఇన్స్టాగ్రామ్ లో 1 మిలియన్ ఫాలోవర్స్ కూడా ఉన్నారు. ఇకపోతే ఆమెపై ఇటీవల వచ్చిన బ్యాడ్ కామెంట్స్ పై కాస్త ఘాటుగానే సమాధానం ఇచ్చింది.

మనోవేదనకు గురైన సుహానా

మనోవేదనకు గురైన సుహానా

సుహానా చాలా వరకు సోషల్ మీడియాలో పాజిటివ్ పోస్ట్ లతోనే జనాలను ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తుంటుంది. కానీ ఈ సారి ఆమె కొందరి మాటలకు తీవ్ర స్థాయిలో మనోవేదనకు గురైనట్లు అర్ధమవుతోంది. ఆమెపై వచ్చిన నెగిటివ్ కామెంట్స్ యొక్క స్క్రీన్ షాట్స్ ని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది.

12 ఏళ్ళ వయసు నుంచే..

12 ఏళ్ళ వయసు నుంచే..

శరీర రంగు నల్లగా ఉందని, చూడటానికి చాలా అసహ్యంగా ఉందని కొందరు నెటిజన్స్ ఇష్టం ఉన్నట్లుగా కామెంట్స్ చేసినట్లు అర్ధమవుతోంది. అయితే ఈ వివక్షను తాను 12 ఏళ్ళ వయసు నుంచి ఎదుర్కొంటున్నట్లు సుహానా తెలిపింది. ప్రస్తుతం సుహానా వయసు 20 ఏళ్ళు. ఇక బ్రౌన్ కలర్ గురించి మాట్లాడుతూ 'అగ్లీ' అంటూ పిలవడంపై అసహనం వ్యక్తం చేస్తూ మనం భారతీయులం.. మన రంగు ఇలానే ఉంటుందని తెలిపింది.

పరిష్కరించాల్సిన సమస్యలలో ఇది కూడా ఒకటి

పరిష్కరించాల్సిన సమస్యలలో ఇది కూడా ఒకటి

సుహానా వివరణ ఇస్తూ.. ప్రస్తుతం చాలా జరుగుతున్నాయి. పరిష్కరించాల్సిన సమస్యలలో ఇది కూడా ఒకటి !! ఇది నా గురించి మాత్రమే కాదు. ఎటువంటి కారణం లేకుండా చాలా మంది యువతి యువకులు ఎదుర్కొంటున్న ఇబ్బంది. స్కిన్ టోన్ కారణంగా 12 సంవత్సరాల వయస్సు నుండి ఆ వివక్షను ఎదుర్కొంటున్నాను. ఎత్తును చూసి కూడా కామెంట్ చేస్తున్నారు. నా ఎత్తు 5'3 అయితే ఏంటీ. అందరూ 5'7 ఉండలేరు. అయినా కూడా మనం ఎలా ఉన్నా ఎవరికి తక్కువ కాదు.

Recommended Video

Shahrukh Khan's Daughter Suhana Khan Latest Photoshoot

అలా ఆలోచిస్తే.. సురక్షితంగా లేరని అర్థం

అవును మా లాంటి వారు వేర్వేరు షేడ్స్‌లోకి వస్తారు. కాని మీరు ఇలాంటి ఆలోచనలతో ఉంటే ఎన్నటికి వాటి నుండి దూరం కాలేరు. సొంత వ్యక్తులను అసహ్యించుకుంటున్నారు అంటే మీరు నిజంగా చాలా బాధతో సురక్షితంగా లేరని అర్థం.. అంటూ సుహానా ఖాన్ తనదైన శైలిలో విమర్శలు చేసే వారికి ఆడిరిపోయే కౌంటర్ ఇచ్చింది. ఇక ఆమె స్పందించిన విధానానికి కూడా కొందరు నెటిజన్స్ మద్దతు పలుకుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X