twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్టార్ హీరో కూతురిని తక్కువ అంచనా వేశారు.. అగ్లీ గర్ల్ అన్నవాళ్లే ఆశ్చర్యపోయేలా ఘాటైన లుక్

    |

    ప్రస్తుత కాలంలో సినిమా ఇండస్ట్రీలో స్టార్స్ తో పాటు వారి పిల్లలకు కూడా అదే స్థాయిలో క్రేజ్ ఏర్పడుతోంది. సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చారు అంటే చాలు ఒక్కసారిగా అభిమానుల సంఖ్య మిలియన్స్ దాటుతోంది. ఇక అలాంటి వారసులలో షారుక్ ఖాన్ కూతురు కూడా ఉంది. సోషల్ మీడియాలో ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే. ఒక స్టార్ హీరోయిన్ రేంజ్ లో క్రేజ్ అందుకుంటోంది.

     తక్కువ సమయంలోనే ఎక్కువ ఫాలోయింగ్

    తక్కువ సమయంలోనే ఎక్కువ ఫాలోయింగ్

    బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ తన పిల్లలను చాలా స్వేచ్ఛగా ఉండడం నేర్పించాడని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఎందుకంటే సుహానా ఖాన్ ఇన్స్టాగ్రామ్ లో ఆమె తనకు నచ్చిన విధంగా గ్లామరస్ ఫొటోలను షేర్ చేస్తూ ఉంటుంది. అందుకే ఇన్స్టాగ్రామ్ లో అతి తక్కువ సమయంలో 1 మిలియన్ ఫాలోవర్స్ ని సంపాదించుకుంది. ఇకపోతే ఆమెపై ఇటీవల వచ్చిన బ్యాడ్ కామెంట్స్ పై కాస్త ఘాటుగానే సమాధానం ఇచ్చింది. అంతే కాకుండా రీసెంట్ గా మరో ఫోటోతో అదిరిపోయే కౌంటర్ కూడా ఇచ్చింది.

    నల్లగా ఉందని హేళన చేశారు

    నల్లగా ఉందని హేళన చేశారు

    సుహానా చాలా వరకు సోషల్ మీడియాలో కాంట్రవర్సీ లేకుండా సింపుల్ పోస్ట్ లతోనే జనాలను ఎక్కువగా ఆకట్టుకుంటుంది. అయితే ఈ మధ్య ఆమె గ్లామర్ పై ట్రోలింగ్స్ ఎక్కువగా వచ్చాయి. ఆమె నల్లగా ఉందని ఫేస్ కూడా ఏమి బాగోలేదని హైట్ కూడా చాలా తక్కువ అంటూ హేళన చేశారు. ఆమెపై వచ్చిన నెగిటివ్ కామెంట్స్ యొక్క స్క్రీన్ షాట్స్ ని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇక ఇప్పుడు గ్లామర్ ఫోటోతో ఒక కౌంటర్ ఇచ్చింది.

    హాట్ లుక్ తో షాక్ ఇచ్చిన సుహానా

    హాట్ లుక్ తో షాక్ ఇచ్చిన సుహానా

    ఒక అందమైన బీచ్ బ్యాక్ గ్రౌండ్ స్టిల్ ఇచ్చిన సుహానా ఫోటోలో బ్లాక్ స్లీవ్‌లెస్ టాప్, బ్లూ డెనిమ్ షార్ట్ తో హాట్ లుక్ లో కనిపించింది. ఇక ఆమె తన జుట్టును పోనీటైల్ లాగా పట్టుకొని కనిపించిన విధానం అలాగే చిన్న స్మైల్ తో ఫోటోకి పొజిచ్చిన తీరు చూస్తుంటే సుహానా తన అసలు గ్లామర్ ని బయటపెట్టినట్లు అర్ధమవుతోంది. నిజంగా నెగెటివ్ కామెంట్స్ చేసిన వారు సుహానాను తక్కువ అంచనా వేశారు అనే పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి.

    Recommended Video

    Shahrukh Khan's Daughter Suhana Khan Latest Photoshoot
    ఆ వయసు నుంచే..

    ఆ వయసు నుంచే..

    శరీర రంగు నల్లగా ఉందని, చూడటానికి చాలా అసహ్యంగా ఉందని ఇటీవల ఇష్టం ఉన్నట్లుగా కామెంట్స్ చేసినవారికి ఊహించని కౌంటర్ ఇచ్చిందనే చెప్పాలి. ఇక ఆ నెగిటివ్ కామెంట్స్ ను సుహానా 12 ఏళ్ళ వయసు నుంచి ఎదుర్కొంటున్నట్లు తెలిపింది. ప్రస్తుతం సుహానా వయసు 20 ఏళ్ళు. ఇక బ్రౌన్ కలర్ గురించి మాట్లాడుతూ 'అగ్లీ' అంటూ పిలవడంపై అసహనం వ్యక్తం చేస్తూ మనం భారతీయులం.. మన రంగు ఇలానే ఉంటుందని కూడా వివరణ ఇచ్చింది.

    English summary
    Stars in the Bollywood film industry have a good following for their children in the same way that they have a craze. Photos of the heirs are going viral on social media. Bollywood King Khan Shah Rukh Khan's daughter Suhana Khan also has a good craze. She also has 1 million followers on Instagram. Now she has responded to the recent bad comments on her
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X