హగ్ ఫ్రమ్ థగ్, వికలాంగురాలిగా అనుష్క... ఆసక్తిరేపుతున్న షారుక్ ‘జీరో’
బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న 'జీరో' చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు గుడ్ న్యూస్. నవంబర్ 2న షారుక్ పుట్టినరోజు సందర్భంగా ట్రైలర్ విడుదల చేయబోతున్నారు. అంతకంటే ముందు షారుక్ తన ట్విట్టర్ పేజీ ద్వారా పలు ఆసక్తికర ఫోటోలు అభిమానులతో పంచుకున్నారు.
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్‌ను హగ్ చేసుకుంటూ ఓ ఫోటో షేర్ చేసిన షారుక్....'హగ్ ఫ్రమ్ థగ్' అనే క్యాప్షన్ తగిలించారు. దీన్ని బట్టి రేపు అమీర్ ఖాన్ చేతుల మీదుగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల కాబోతోందని తెలుస్తోంది.

జీరో.. ముగ్గురు హీరోలు
బాలీవుడ్ టాప్ 3 హీరోలైన సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, అమీర్ ఖాన్ ఈ ముగ్గురూ ‘జీరో' చిత్రాన్ని ఓ రేంజికి తీసుకెళ్లే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. ఇందులో సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇపుడు ‘జీరో' ప్రమోషన్లలో అమీర్ ఖాన్ కూడా భాగమయ్యారు.

వికలాంగురాలిగా అనుష్క
ఈ చిత్రంలో అనుష్క శర్మ వికలాంగురాలిగా కనిపించబోతున్నట్లు తాజాగా షారుక్ ఖాన్ తన ట్విట్టర్ ద్వారా విడుదల చేసిన పోస్టర్ బట్టి స్పష్టం అవుతోంది. ఇందులో ఆమె హీరో ఫ్రెండ్ పాత్రలో అనుష్క కనిపించబోతున్నారని సమాచారం.

హాట్ బ్యూటీగా కత్రినా
కత్రినాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేస్తూ..‘చాలా మంది నక్షత్రాలను దగ్గర నుంచి చూడాలని కలలు కంటుంటారు. కానీ నేను చంద్రుడిని దగ్గర నుంచి చూశాను' అని షారుక్ వ్యాఖ్యానించారు.

ఛాలెంజింగ్ పాత్రలో షారుఖ్
ఇందులో షారుక్ ఖాన్ మరుగుజ్జుగా కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో ఆయన పాత్ర చాలెజింగ్‌గా ఉంటుందని అంటున్నారు. ఆనందర్ ఎల్ రాయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ డిసెంబర్ 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


Click it and Unblock the Notifications











