Don't Miss!
- News AP Nominations: రేపు లోకేష్, ఎల్లుండి చంద్రబాబు నామినేషన్లు..!
- Automobiles సెకండ్ హ్యాండ్ కార్లలో ఎక్కువగా వీటికే ప్రాధాన్యత ఇస్తున్నారట.. ఆ కార్లపైనే క్రేజ్ ఎక్కువ!!
- Finance Gautam Adani: గౌతమ్ అదానీ జీవితాన్ని మార్చిన లేడీ డెంటిస్ట్.. ఆమె ఎవరంటే..??
- Sports KKR vs RR: రాజస్థాన్ చేతిలో ఓటమి.. గంభీర్‌ను ఓదార్చిన షారుఖ్ ఖాన్! వీడియో
- Travel ఇండియాలోని సమ్మర్లో వెళ్లకూడని సందర్శనీయ ప్రదేశాలివే!
- Lifestyle Egg Dum Biryani : గుడ్డుతో రుచికరమైన దమ్ బిర్యానీ..ఒకసారి రుచి చూస్తే మొత్తం మీరే లాగించేస్తారు
- Technology Haier నుంచి నాలుగు కొత్త స్మార్ట్ టీవీలు! ధరలు, స్పెసిఫికేషన్ల వివరాలు
ఈసారి ఎలాగైనా టైటిల్ కొట్టాలి: టీమ్‌ను మోటివేట్ చేస్తూ పాట పాడిన షారుక్!
బాలీవుడ్ యాక్టర్ షారుక్ ఖాన్ ఐపీఎల్ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టకు యజమానిగా ఉన్న సంగతి తెలిసిందే. త్వరలో ఐపీఎల్ 12 సీజన్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో తన టీమ్ కోసం ఆయన ఓ పాట పాడారు. ఈ సాంగ్ కోల్‌కతా నైట్ రైడర్స్ గీతంగా ఉండబోతోందని తెలుస్తోంది.
బప్పిలహరి, అతడి కుమారుడు ఈ సాంగ్ కంపోజ్ చేశారు. చాలా రిహార్సల్స్ తర్వాత షారుక్ ఈ పాటను పాడినట్లు తెలుస్తోంది. ఈ గీతం కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు సభ్యుల్లో, అభిమానుల్లో మరింత ఉత్సాహం నింపేవిధంగా ఉండబోతోందట.
2008లో ఐపీఎల్ తొలి సీజన్ మొదలవ్వగా... ఇప్పటి వరకు 11 సీజన్లు పూర్తయ్యాయి. 2012, 2014లో కోల్‌కతా నైట్ రైడర్స్ టైటిల్ దక్కించుకుంది. త్వరలో 12వ సీజన్ మొదలు కాబోతోంది. ఈ సారి ఎలాగైన విజేతలుగా నిలవాలని షారుక్ తన జట్టును మోటివేట్ చేయడంలో భాగంగా పాట పాడాడరు.
సినిమాల విషయానికొస్తే... షారుక్ నటించిన చివరగా ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో రూపొందిన 'జీరో'. అయితే ఈ చిత్రానికి నెగెటివ్ రివ్యూలు రావడం, ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం కావడంతో ప్లాప్ అయింది. ఐపీఎల్ సీజన్ ముగిసిన తర్వాత ఆయన తన తర్వాతి చిత్రంపై ఫోకస్ పెట్టనున్నారు.