twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఈసారి ఎలాగైనా టైటిల్ కొట్టాలి: టీమ్‌ను మోటివేట్ చేస్తూ పాట పాడిన షారుక్!

    |

    బాలీవుడ్ యాక్టర్ షారుక్ ఖాన్ ఐపీఎల్ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టకు యజమానిగా ఉన్న సంగతి తెలిసిందే. త్వరలో ఐపీఎల్ 12 సీజన్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో తన టీమ్ కోసం ఆయన ఓ పాట పాడారు. ఈ సాంగ్ కోల్‌కతా నైట్ రైడర్స్ గీతంగా ఉండబోతోందని తెలుస్తోంది.

    బప్పిలహరి, అతడి కుమారుడు ఈ సాంగ్ కంపోజ్ చేశారు. చాలా రిహార్సల్స్ తర్వాత షారుక్ ఈ పాటను పాడినట్లు తెలుస్తోంది. ఈ గీతం కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు సభ్యుల్లో, అభిమానుల్లో మరింత ఉత్సాహం నింపేవిధంగా ఉండబోతోందట.

     Shahrukh Khan has lent his voice for his IPL team

    2008లో ఐపీఎల్ తొలి సీజన్ మొదలవ్వగా... ఇప్పటి వరకు 11 సీజన్లు పూర్తయ్యాయి. 2012, 2014లో కోల్‌కతా నైట్ రైడర్స్ టైటిల్ దక్కించుకుంది. త్వరలో 12వ సీజన్ మొదలు కాబోతోంది. ఈ సారి ఎలాగైన విజేతలుగా నిలవాలని షారుక్ తన జట్టును మోటివేట్ చేయడంలో భాగంగా పాట పాడాడరు.

    సినిమాల విషయానికొస్తే... షారుక్ నటించిన చివరగా ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో రూపొందిన 'జీరో'. అయితే ఈ చిత్రానికి నెగెటివ్ రివ్యూలు రావడం, ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం కావడంతో ప్లాప్ అయింది. ఐపీఎల్ సీజన్ ముగిసిన తర్వాత ఆయన తన తర్వాతి చిత్రంపై ఫోకస్ పెట్టనున్నారు.

    English summary
    Actor Shah Rukh Khan has lent his voice for his IPL team - Kolkata Knight Riders. The anthem of the team is composed by Bappi Lahiri and son, and the superstar actor has crooned his voice, after rehearsing a lot.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X