twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మానవత్వాన్ని చాటుకొంటున్న షారుక్.. బెంగాల్‌లో తుఫాన్ బాధితుల కోసం..

    |

    పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఎంఫాన్ తుఫాన్‌ దెబ్బకు తల్లడిల్లుతున్న ప్రజలను ఆదుకొనేందుకు బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ముందుకొచ్చారు. తాను యజమానిగా ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు, అలాగే మీర్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా సహాయ కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయం తీసుకొన్నారు. ఎంఫాన్ తుఫాన్ కారణంగా దాదాపు 98 మంది ప్రాణాలు కోల్పోవడంతో షారుఖ్ ఖాన్ తీవ్ర విచారంలో మునిగిపోయారు.

    కోల్‌కతా పట్టణంతో అనుబంధం విడదీయలేనిది. నాకు మానసికంగా ఓ బలం. అలాంటి నగరంలోని ప్రజలు తుఫాన్ దాటికి తల్లడిల్లడం నాకు ఆందోళన కలిగించింది. వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ఉందని గ్రహించాను అని షారుక్ ట్వీట్ చేశారు.

    Shahrukh Khan intiatives for Cyclone Amphan victims in West Bengal

    షారుక్ తన సహాయ కార్యక్రమాల గురించి వివరిస్తూ.. కేకేఆర్, మీర్ ఫౌండేషన్ ద్వారా ప్రజలకు సహాయం అందిస్తున్నాం. కేకేఆర్ సహాయత వాహనం ద్వారా బాధిత ప్రజలకు నిత్యావసర వస్తువులను, పుష్టికరమైన ఆహారం అందిస్తున్నాం అని తెలిపారు. అలాగే తుఫాన్ ధాటికి ధ్వంసమైన ఇళ్లను కూడా బాగుచేసేందుకు దళాలను నియమించాం. అలాగే యాసిడ్ బాధితులను ఆదుకొంటాం అని చెప్పారు.

    కోల్‌కతాతో నాకు భావోద్వేగమైన బంధం ఉంది. ఈ చారిత్రాత్మక పట్టణంలో ప్రేమ, స్నేహం, సంతోషం నాకు లభించింది. అంతేకాకుండా కోల్‌కతా ప్రజల స్పూర్తి నాకు విశేషంగా నచ్చుతుంది. ఇలాంటి సమయంలో వారిని ఆదుకోకపోతే నాకు తప్తి ఉండదు అని షారుక్ ఖాన్ పేర్కొన్నారు.

    English summary
    Shahrukh Khan intiatives for Cyclone Amphan victims in West Bengal. He tweeted that Kolkata, with unity comes strength and resilience. Let’s get through this together and help out those affected by Amphan.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X