For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Pathaan First Review: షారుక్ ఖాన్ 'పఠాన్' సినిమాకు అలాంటి టాక్.. ఊహించని ట్విస్టులు, చివరి 15 నిమిషాలు అలా!

  |

  బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ తనదైన శైలీలో సినిమాలు చేస్తూ హిందీ చిత్రసీమకు బాద్ షా అయ్యాడు. సుధీర్ఘమైన ఆయన సినీ ప్రయాణంలో అశేష అభిమానగనాన్ని సంపాదించుకున్నాడు. దాదాపుగా 80కి పైగా చిత్రాల్లో నటించిన షారుక్ ఖాన్ 14 ఫిలీం ఫేర్ అవార్డులను పొందాడు. అంతేకాకుండా ఎంతో మంది హీరోయిన్లను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ కు ఉంది. ఈ బాలీవుడ్ బాద్ షా సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు షారుక్ ఖాన్ 'పఠాన్'గా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో షారుక్ ఖాన్ 'పఠాన్' మూవీ మొదటి రివ్యూ రానే వచ్చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

  వివాదంగా బేషరమ్ రంగ్ సాంగ్..

  బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్, హాట్ బ్యూటి దీపిక పదుకొణె మరోసారి జంటగా నటించిన చిత్రం పఠాన్. చాలా కాలం గ్యాప్ అంటే దాదాపుగా మూడేళ్ల తర్వాత షారుక్ ఖాన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అభిమానులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. అందుకు తగినట్లుగానే పఠాన్ షూటింగ్ తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇక పఠాన్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిత్రంలోని ఫస్ట్ సింగిల్ బేషరమ్ రంగ్ పాటను డిసెంబర్ 12వ విడుదల చేసిన విషయం తెలిసిందే. షారుక్, దీపికల హాట్ నెస్ తో బేషరమ్ రంగ్ సాంగ్ ఎంత క్రేజ్ తెచ్చుకుందో అంతే విమర్శల పాలయింది.

  U/A సర్టిఫికేట్..

  ఇందులో దీపికా పదుకొణె కాషాయ రంగు బికినీ ధరించడంపై మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రి నరోత్తమ్ మిశ్రాతోపాటు పలు సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. అలాగే సినిమాను విడుదల చేయడం ఆపాలని డిమాండ్ కూడా చేశారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలోని బేషరమ్ సాంగ్ లో అభ్యంతరకర సన్నివేశాలు తొలగిస్తూ సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ ఇచ్చిన విషయం తెలిసిందే. మొత్తంగా పఠాన్ సినిమాలో 12 సన్నివేశాలను తొలగించిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ U/A సర్టిఫికేట్ జారీ చేసింది.

  వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్..

  యాక్షన్ చిత్రాలకు పేరొందిన సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన పఠాన్ సినిమా జనవరి 25, 2023న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ప్రముఖ హిందీ నిర్మాణ సంస్థ యష్ ఫిలిమ్స్ బ్యానర్ లో వస్తున్న ఈ చిత్రంలో హీరో జాన్ అబ్రహం కీలక పాత్ర పోషిస్తున్నాడు. అలాగే ఈ మూవీలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా అతిధి పాత్రలో మెరవనున్నాడని టాక్ వినిపిస్తోంది.

  జోరుగా అడ్వాన్స్ బుకింగ్..

  ఇదిలా ఉంటే షారుక్ ఖాన్ పఠాన్ సినిమాను వరల్డ్ వైడ్ గా 200 నగరాల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇక ఈ సినిమాకు వరల్డ్ వైడ్ గా అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగాయి. క్షణాల్లో హాట్ కేకుల్లా టికెట్స్ అమ్ముడు పోవడం చూస్తే షారుక్ ఖాన్ ఫాలోయింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమాను ఇటీవల చూసిన ఫిల్మ్ క్రిటిక్, సెన్సార్ బోర్డ్ మెంబర్ ఉమర్ సంధు తన ఫస్ట్ రివ్యూను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు.

  ఎక్సలెంట్ డైరెక్షన్..

  "పఠాన్ సినిమా గురించి చెప్పాలంటే ఇది పూర్తిగా మాస్ ఎంటర్టైనర్. ఈ సినిమాలో హై ఆక్టెన్ స్టంట్స్ ఉన్నాయి. షారుక్ ఖాన్ ఎంట్రూ పైసా వసూల్ గా ఉంటుంది. ఎక్సలెంట్ డైరెక్షన్ తో ఎంగేజింగ్ గా ఉండే కథ. షారుక్ ఖాన్, జాన్ అబ్రహం సన్నివేశాల్లో వచ్చే బీజీఎం థ్రిల్లింగ్ గా ఉంటుంది. డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ తన ఊహ చిత్రంగా తెరకెక్కించిన ఈ స్పై సినిమా ఎలాంటి డౌట్ లేకుండా విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇక షారుక్ ఖాన్, దీపికా పదుకొణె చంపేశారు" అని రాసుకొచ్చాడు ఉమర్ సంధు.

  చివరి 15 నిమిషాలు..

  "ఇప్పటివరకు నేను బాలీవుడ్ చిత్రాల్లో చూసిన సినిమాల్లో కెల్లా బెస్ట్ యాక్షన్ చిత్రం పఠాన్. సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకు థ్రిల్లింగ్ యాక్షన్ తో అనేక మైన ట్విస్టులు, మలుపులతో సాగుతుంది. సినిమా మొత్తంలో షారుక్ ఖాన్, దీపికా పదుకొణె, జాన్ అబ్రహం పర్ఫామెన్స్ టెర్రిఫిక్ గా ఉంది. ఇక పఠాన్ క్లైమాక్స్ మిమ్మల్ని షాక్ కు గురి చేస్తుంది. చివరి 15 నిమిషాలు సీట్ ఎడ్జ్ లో కూర్చొబెట్టి గూస్ బంప్స్ తెప్పిస్తాయి" అని మరొక ట్వీట్ లో రాసుకొచ్చారు ఫిల్మ్ క్రిటిక్.

  బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా..

  "ఒక సినిమాలో షారుక్ ఖాన్ కు ఎలాంటి అర్హతలు ఉండాలో అలా చూపించిన చిత్రం, అలాంటి హీరోకు తగిన సినిమా పఠాన్. ఈ క్యారెక్టర్ పవర్ ఫుల్ మాత్రమే కాకుండా మెంటల్లీ, ఫిజికల్లీ తెలివైనది. షారుక్ ఖాన్ స్వాగ్ మైండ్ బ్లోయింగ్. మన కింగ్ దుమ్ము లేపేందుకు మళ్లీ వచ్చాడు. నా మాటలు రాసిపెట్టుకోండి. బాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా పఠాన్ నిలుస్తుంది. ఈ సినిమాకు నేను 5 స్టార్ రేటింగ్ ఇస్తున్నాను. గతేడాది RRR చిత్రానికి ఇచ్చాను. ఈ ఏడాది పఠాన్ సినిమాకు 5 స్టార్ రేటింగ్ ఇస్తున్నాను. ఆ సినిమాకు ఆ అర్హత ఉంది" అని చెప్పుకొచ్చాడు సెన్సార్ బోర్డ్ సభ్యుడు ఉమర్ సంధు.

  English summary
  Shahrukh Khan Deepika Padukone Starrer Movie Pathaan First Review By Film Critic And Sensor Board Member Umair Sandhu. షారుక్ ఖాన్ దీపికా పదుకొణె పఠాన్ సినిమా ఫస్ట్ రివ్యూ.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X