Don 3 Teaser: షారుక్ ఖాన్ ప్లేసులో కొత్త 'డాన్'.. తిట్టిపోస్తున్న నెటిజన్లు

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ తనదైన శైలీలో సినిమాలు చేస్తూ హిందీ చిత్రసీమకు కింగ్ ఖాన్ అయ్యాడు. సుధీర్ఘమైన ఆయన సినీ ప్రయాణంలో అశేషమైన అభిమానులను సంపాదించుకున్నాడు. దాదాపుగా 80కి పైగా చిత్రాల్లో నటించిన షారుక్ ఖాన్ 14 ఫిలీం ఫేర్ అవార్డులను పొందాడమే కాకుండా అనేక మంది హీరోయిన్లను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత దక్కించుకున్నాడు.

ఇక షారుక్ ఖాన్ కెరీర్ లో క్రేజీ ఫ్రాంచైజీగా నిలిచింది డాన్ సిరీస్. అలాంటి ఈ సిరీస్ నుంచి మూడో సినిమాగా డాన్ 3 (Don 3) రానుంది. కానీ, తాజాగా విడుదలైన డాన్ 3 టీజర్ చూసిన షారుక్ అభిమానులు, నెటిజన్లు మేకర్లను తిట్టిపోస్తున్నారు.

Shahrukh Khan Replaced With Ranveer Singh For Farhan Akhtar Don 3

జవాన్ మూవీతో: కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ కు బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎన్నో ఏళ్లుగా ఖాన్ త్రయంలో నెంబర్ వన్ హీరోగా సత్తా చాటుతూ వస్తున్నాడు. ఇక షారుక్ ఖాన్ సినిమా కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. ఇటీవల పఠాన్ సినిమాతో సూపర్ హిట్ కమ్ బ్యాక్ ఇచ్చి ఫ్యాన్స్ కు ఫుల్ ట్రీట్ అందించాడు. త్వరలో జవాన్ మూవీతో అలరించేందుకు సిద్ధంగా ఉన్నాడు.

Shahrukh Khan Replaced With Ranveer Singh For Farhan Akhtar Don 3

బిగ్ బి అమితాబ్: ఇటీవల జవాన్ నుంచి విడుదలైన టీజర్, పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. పఠాన్ కంటే ఎక్కువగా జవాన్ ఉండనుందని అభిమానులు అంటున్నారు. ఇదిలా ఉంటే సాధారణంగా ఫ్రాంచైజీ సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుంది. అలా హిందీలో క్రేజ్ సంపాదించుకున్న మూవీ సిరీస్ డాన్ (Don). అప్పట్లో డాన్ గా బిగ్ బి అమితాబ్ బచ్చన్ అదరగొట్టి మరింతగా ఫ్యాన్స్ పెరిగేలా చేసుకున్నారు.

రెండు సినిమాలు: అమితాబ్ బచ్చన్ తర్వాత డాన్ గా షారుక్ ఖాన్ అలరించాడు. "డాన్: ది చేజ్ బిగిన్స్ ఎగైన్", "డాన్ 2: ది కింగ్ ఈజ్ బ్యాక్" సినిమాలతో మంచి హై ఓల్టేజ్ యాక్షన్ తో అదరగొట్టాడు షారుక్ ఖాన్. ఈ రెండు సినిమాల తర్వాత సీక్వెల్ గా మూడోది ఎప్పుడెప్పుడు వస్తుందా అని అంతా ఎదురుచూశారు. ఆ మధ్య డాన్ 3 ఉంటుందని హింట్ ఇచ్చారు. ఇక తాజాగా డాన్ 3 టీజర్ (Don 3 Teaser) ను విడుదల చేసి అనుమానాలన్నింటికి చెక్ పెట్టారు మేకర్స్.

Shahrukh Khan Replaced With Ranveer Singh For Farhan Akhtar Don 3

సరికొత్త డాన్: అయితే డాన్ 3 సినిమాలో షారుక్ ఖాన్ కు బదులు రణ్ వీర్ సింగ్ ను చూపించారు మేకర్స్. అంటే సరికొత్త డాన్ గా రణ్ వీర్ సింగ్ నటించనున్నాడు. టీజర్ ఎండింగ్ లో మే హూ డాన్ అంటూ తన స్టైల్ లో డైలాగ్ చెప్పాడు రణ్ వీర్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అవుతోంది. అయితే ఈ టీజర్ చూసిన షారుక్ ఫ్యాన్స్ మాత్రం దర్శకనిర్మాతలపై ఫైర్ అవుతున్నారు.

ఫర్హాన్ అక్తర్ డైరెక్షన్: రణ్ వీర్ సింగ్ తో "డాన్ 3: న్యూ ఎరా బిగినింగ్" అంటూ రిలీజ్ చేసిన టీజర్ పై ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. షారుక్ ఖాన్ లేకుంటే డాన్ ఫ్రాంచైజీ లేదంటూ నెటిజన్లు నిరసనలు తెలుపుతున్నారు. ఇక రణ్ వీర్ ఫ్యాన్స్ మాత్రం ఖుషీ అవుతున్నారు. కాగా డాన్ 3 సినిమాను 2025లో విడుదల చేయనున్నారు. ఎక్సల్ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ పై మరో హిందీ నటుడు ఫర్హాన్ అక్తర్ డాన్ 3ను తెరకెక్కిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X