బిగిల్ దర్శకుడితో షారుక్ ఖాన్ బిగ్ బడ్జెట్ మూవీ.. ఆ హీరోయిన్ ఫిక్స్

బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో గత కొంత కాలంగా షారుక్ ఖాన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై అనేక రకాల రూమర్లు వినిపిస్తున్నాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా వరుస డిజాస్టర్స్ తో కాస్త ఇబ్బంది పడిన షారుక్ ఖాన్ జీరో సినిమా తరువాత మరో సినిమాను సెట్స్ పైకి తీసుకురాలేదు. ఇక ఆల్ మోస్ట్ బిగిల్ డైరెక్టర్ అట్లీతో ఒక ప్రాజెక్ట్ సెట్ అనుకున్న సమయంలో ఎందుకో ఆ ప్రాజెక్టు ఇంకా ఆలస్యం అవుతోంది.

ఆ సినిమాకు "సంకీ" అనే టైటిల్ ని కూడా అనుకుంటున్నట్లు టాక్ వస్తోంది. ఇక ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. అట్లీ, షారుక్ కాంబినేషన్ లో రానున్న ఆ బిగ్ బడ్జెట్ సినిమాలో హీరోయిన్ గా హాట్ గ్లామర్ బ్యూటీ దిపికా పదుకొన్ ఫిక్స్ అయినట్లు కథనాలు వెలువడుతున్నాయి. త్వరలోనే ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

Shahrukh Khan reunite with Deepika Padukone for sanki movie

ఇక ఇప్పటికే దీపికా.. ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమాలో హీరోయిన్ గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు తన భర్త రణ్ వీర్ సింగ్ తో నటించిన కపిల్ దేవ్ బయోపిక్ 83 విడుదలకు సిద్ధమవుతోంది. ఈ విధంగా దీపికా చాలా పెద్ద ప్రాజెక్టులలో నటిస్తూ తన ఆదాయాన్ని క్రేజ్ ని మరింత పెంచుకుంటోంది.

ఇక అట్లీ, షారుక్ 'సంకీ' సినిమాషూటింగ్ కరోనా వైరస్ కాస్త అదుపులోకి వచ్చిన తరువాత స్టార్ట్ కానున్నట్లు సమాచారం. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించాలని దర్శకుడు అట్లీ ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ తెరపైకి ఎప్పుడు వస్తుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X