షారుఖ్ ఖాన్ కుమారుడి వీడియో వైరల్... ఐదేళ్ల వయసులోనే మీడియాపై ఫైర్!

బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ చిన్న కుమారుడు అబ్‌రామ్ వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతోంది. ఈ ఐదేళ్ల బుడ్డోడు మీడియా మీద కస్సుబుస్సులాడుతున్న వైనం చూసి అందరూ ఆశ్చర్య పోతున్నారు. ఈ వయసులోనే ఇలా ఉన్నాడంటే... కాస్త పెద్దయితే అతడి వ్యవహారం ఎలా ఉంటుందో అంటూ చర్చించుకుంటున్నారు.

ఐశ్వర్యరాయ్ కూతురు ఆరాధ్య బచ్చన్ బర్త్ డే పార్టీలో పాల్గొనేందుకు ఇటీవల అబ్ రామ్.... బచ్చన్స్ నివాసానికి వచ్చాడు. పార్టీ నుంచి వెళుతుండగా కెమెరామెన్లు తనను ఫోటోస్ తీసేందుకు ఎగబడటంతో వారిపై ఫైర్ అయ్యాడు.

వైరల్ అవుతున్న వీడియో ఇదే

అబ్‌రామ్ బాడీగార్డ్.... అతడి ఫేస్ కనిపించకుండా కవర్ చేస్తూ కారు వద్దకు తీసుకెళుతుండగా అక్కడ ఉన్న మీడియా కెమెరామెన్లు వేగంగా తమ పని కానిచ్చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన అబ్ రామ్ ‘నో పిక్చర్స్' అంటూ వారిపై అరిచాడు.

బుడ్డోడు ఎంత ఇబ్బంది పడ్డాడో

బుడ్డోడు ఎంత ఇబ్బంది పడ్డాడో

ఈ మధ్య కాలంలో సెలబ్రిటీల వెంట పడుతూ... వద్దు వద్దు అంటున్నా వినిపించుకోకుండా వారిని ఫోటోస్ తీస్తూ ఇబ్బంది పెడుతున్న సంఘటనలు తరచూ చూస్తున్నాం. పెద్ద పెద్ద స్టార్సే ఎన్నోసార్లు వారి చర్యలకు విసుగు చెంది ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్బాలు ఉన్నాయి. మరి ఐదేళ్ల అబ్‌రామ్ ఎంత ఇబ్బంది పడ్డాడో అర్థం చేసుకోవచ్చు.

అనవసర వివాదాలు, అందుకే దూరంగా...

అనవసర వివాదాలు, అందుకే దూరంగా...

కొన్ని మీడియా సంస్థలు తమ ఫోటోలను వాడుకుని అనవసర కాంట్రవర్సీలు క్రియేట్ చేస్తుండటం, తాము ఎక్కడికి వెళ్లినా ఇబ్బంది పెడుతూ తమ ప్రైవేట్ లైఫ్‌కు ఆటంకం కలిగిస్తుండటం లాంటి సంఘటనలు ఎక్కువ అవుతుండటమే ఈ పరిస్థితికి కారణం.

 పిల్లల విషయంలో షారుక్ ఖాన్‌కు చేదు అనుభవాలు

పిల్లల విషయంలో షారుక్ ఖాన్‌కు చేదు అనుభవాలు

షారుక్ ఖాన్ సైతం కొన్ని మీడియా సంస్థల అత్యుత్సాహంతో గతంలో ఇబ్బంది పడ్డ అంశాలు, చేదు అనుభవాలు ఎదుర్కొన్న సంఘటనలు ఉన్నాయి. గతంలో షారుక్ కూతురు బికినీ ఫోటోపై కొన్ని మీడియా సంస్థలు రచ్చ చేసిన సంగతి తెలిసిందే. అందుకే వారికి తన పిల్లలను షారుక్ వీలైనంత దూరంగా ఉంచుతున్నారు. పిల్లలు కూడా మీడియా పట్ల అదే పాలసీ ఫాలో అవుతున్నారు అనడానికి అబ్ రామ్ ప్రవర్తనే నిదర్శనం.

Recommended Video

Shahrukh Khan's Zero Movie Faces A Controversy

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X