షారుక్ ఖాన్ ‘జీరో’ ట్రైలర్: నవ్విస్తుంది, ఏడిపిస్తుంది, ఆశ్చర్య పరుస్తుంది!
Recommended Video

షారుక్ ఖాన్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'జీరో' మూవీ ట్రైలర్ శుక్రవారం బాద్ షా పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. ముంబైలో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో అట్టహాసంగా రిలీజ్ చేసిన ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలు మరింత పెంచింది.
షారుక్ ఖాన్ మరుగుజ్జు పాత్రలో నటించిన ఈ ట్రైలర్లోని భావోద్వేగాలు ప్రతి ఒక్కరినీ కట్టిపడేసేలా ఉన్నాయి. ఇందులో అనుష్క శర్మ వికలాంగురాలిగా నటించగా, కత్రినా కైఫ్ గ్లామర్ డాల్‌గా అభిమానులను ఎంటర్టన్ చేయనుంది.

నవ్విస్తుంది, ఏడిపిస్తుంది, ఆశ్చర్య పరుస్తుంది
‘జీరో' మూవీ ట్రైలర్ చూసిన తర్వాత.... ఈ సినిమా ప్రేక్షకులను కొన్ని సందర్భాల్లో నవ్విస్తుంది, మరికొన్ని సందర్భాల్లో ఏడిపిస్తుంది, మరికొన్ని సందర్భాల్లో ఆశ్చర్య పరిచే విధంగా ఉంటుందని స్పష్టమవుతోంది.

షారుక్ కెరీర్లోనే ది బెస్ట్ మూవీ కాబోతోందా?
ట్రైలర్లో షారుక్ ఖాన్ నటన చూసిన ప్రతి ఒక్కరూ ముద్దులైపోతున్నారు. ఈ చిత్రం ఆయన కెరీర్లోనే ది బెస్ట్ మూవీ అవుతుందనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. మరుగుజ్జు పాత్రలో షారుక్ అల్టిమేట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారని అంటున్నారు.

వికలాంగురాలిగా అనుష్క శర్మ
ఈ చిత్రంలో అనుష్క శర్మ వీల్ చైర్‌కే పరిమితమైన వికలాంగురాలిగా కనిపించబోతున్నారు. షారుక్, అనుష్క మధ్య వచ్చి సన్నివేశాలు ఫన్నీగా ఉండటంతో పాటు కొన్ని సందర్భాల్లో భావోద్వేగానికి గురించేలా ఉంటాయని తెలుస్తోంది.

గ్లామర్ లేడీగా కత్రినా కైఫ్
ఈ చిత్రంలో కత్రినా కైఫ్ హాట్ లేడీగా కనిపించబోతున్నారు. షారుక్-కత్రినా మధ్య వచ్చే సన్నివేశాలు అభిమానులను ఆకట్టుకునేలా ఉండబోతున్నాయి.

కత్రినా, షారుక్ ముద్దు సీన్
ఈ సినిమాలో కత్రినా కైఫ్, షారుక్ ఖాన్ మధ్య ఒక లిప్ లాక్ ముద్దు సన్నివేశం సైతం చిత్రీకరించారు. మరి మరుగుజ్జు షారుక్.... ఈ గ్లామర్ లేడీని ఎలా తన ప్రేమలో పడేశాడు అనేది తెరపై ఆసక్తికరంగా ఉంటుందట.

బాలీవుడ్ స్టార్స్ స్పెషల్ అప్పియరెన్స్
ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ అతిథి పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. దీంటో పాటు లేట్ లెజెండ్ శ్రీదేవి, రాణి ముఖర్జీ, కాజోల్, అలియా భట్, అభయ్ డియోల్, ఆర్ మాధవన్, దీపిక పదుకోన్ స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వనున్నారు. శ్రీదేవి చనిపోక ముందే ఆమెకు సంబంధించిన సీన్లు చిత్రీకరించారట.
జీరో
మరుగుజ్జు కావడంతో నువ్వు ఎందుకూ పనికి రావని, జీరో అంటూ అవమానాలు ఎదుర్కొనే వ్యక్తి కథే ఈ సినిమా అని తెలుస్తోంది. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించిన ఈ మూవీని రెడ్ చిల్లీస్ ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై గౌరీఖాన్ నిర్మించారు. డిసెంబర్ 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


Click it and Unblock the Notifications











